వీకెండ్ రిలీజెస్

Wednesday,November 21,2018 - 12:03 by Z_CLU

ఈ శుక్రవారం 4 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో స్టార్ట్ ఎట్రాక్షన్ ఉన్న సినిమాలేవీ లేవు. ఒక విధంగా చెప్పాలంటే అన్నీ చిన్న సినిమాలే.

వీటిలో కాస్తోకూస్తో ఎట్రాక్ట్ చేస్తున్న సినిమా 24-కిస్సెస్. హీరోహీరోయిన్లు ఏకథాటిగా ముద్దులు పెట్టుకుంటున్న సీన్స్ ను బ్యాక్ టు బ్యాక్ కట్ చేసి ప్రోమోగా విడుదల చేయడమే ఈ సినిమాకు మైలేజీ తీసుకొచ్చింది. ఇందులో హీరోయిన్ కు హీరో 24 రకాలుగా, 24 ముద్దులు పెడతాడట. ఆ ముద్దులకు సినిమా స్టోరీకి గమ్మత్తయిన లింక్ ఉంటుందంటున్నాడు దర్శకుడు అయోధ్యకుమార్. అరుణ్ అదిత్, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లు గా నటించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది.

అయితే 24-కిస్సెస్ కంటే ముందే మరో సినిమా విడుదలకు సిద్ధమైంది. దాని పేరు శరభ. దేవుడు-దెయ్యం-మనిషి మధ్య జరిగే సంఘటనల సమాహారమే ఈ సినిమా. ఓ మానవుడి సమహాయంతో రాక్షస శక్తిపై దైవం సాధించే విజయమే శరభ. ఆకాష్ కుమార్, మిస్తీ చక్రవర్తి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు నరసింహారావు దర్శకుడు.

ఈ రెండు సినిమాలతో పాటు శుక్రవారం హలా, లా (లవ్ అండ్ వార్) అనే మరో 2 చిన్న సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. ఈమధ్య వస్తున్న బోల్డ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా తెరకెక్కింది హవా. ఇదొక కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఇక కమల్ కామరాజు ప్రధాన పాత్రలో లవ్ అండ్ వార్ అనే సినిమా కూడా శుక్రవారమే థియేటర్లలోకి వస్తోంది. ఇది కూడా థ్రిల్లర్ సినిమానే.