ఈ వీకెండ్ ఏ మూవీ హిట్టవుతుంది...?

Wednesday,March 21,2018 - 12:59 by Z_CLU

కలర్ ఫుల్ సినిమాలతో రెడీ అయింది ఈ వారం బాక్సాఫీస్. డిఫెరెంట్ స్టోరీలైన్స్ తో ఈ శుక్రవారం బాక్సాఫీస్ బరిలోకి దిగనున్న సినిమా వివరాలివే….

 

రాజరథం : నిరూప్ భండారి, అవంతిక శెట్టి జంటగా నటించిన సినిమా రాజరథం. ఈ సినిమాకి రానా వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఈ సినిమా చుట్టూ పాజిటివ బజ్ క్రియేట్ అయింది. డిఫెరెంట్ స్టోరీతో రొమాంటిక్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కిన ఈ సినిమాకి దర్శకుడు నిరూప్ భండారి.

 

M.L.A.: కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ M.L.A. మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా సాంగ్స్, సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఉపేంద్ర మాధవ్ ఈ సినిమాకి డైరెక్టర్.

 

నీదీ నాదీ ఒకే కథ : శ్రీవిష్ణు, బిచ్చగాడు ఫేం సాట్నా టైటస్ జంటగా నటించిన ఈ ఇంటెన్సివ్ ఎంటర్ టైనర్ కి వేణు ఉడుగుల డైరెక్టర్. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ యూత్ తో పాటు మాస్ ని కూడా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఏ రేంజ్ లో నిలబడనుందో ఈ ఫ్రైడే తెలిసిపోతుంది.

ఆనందం : మలయాళంలో సూపర్ హిట్టయిన ఈ సినిమా తెలుగులో అదే పేరుతో విడుదలకు సిద్ధమైంది. అరుణ్ కురియన్, థామస్ మాథ్యూ, రోషన్ మాథ్యూ, విశాక్ నాయర్, మహాజనకట్టి తదితరులు నటించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తెలుగులోనూ అదే రేంజ్ లో ఇంప్రెస్ చేస్తుందని కాన్ఫిడెంట్ ఉంది సినిమా యూనిట్.

 

అనగనగా ఒక ఊళ్ళో : లాస్ట్ వీక్ కిరాక్ పార్టీతో పాటు విడుదల కావాల్సిన ఈ సినిమా, ఈ వీకెండ్ కు వాయిదాపడింది. అశోక్ కుమార్, ప్రియాంక శర్మ జంటగా నటించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ఇది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా చంద్ర బాలాజీ ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కింది. సాయికృష్ణ K.V. డైరెక్టర్.

 

ఈ సినిమాలతో పాటు మర్ల పులి అనే మరో సినిమా కూడా ఈ ఫ్రైడే రిలీజవుతుంది.