టాక్సీవాలాకు కలిసొచ్చిన పబ్లిక్ హాలిడే

Wednesday,November 21,2018 - 01:19 by Z_CLU

విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన టాక్సీవాలా సినిమాకు ఇప్పటికే సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. మొదటి రోజే బ్రేక్-ఈవెన్ సాధించిన ఈ సినిమాకు ఇప్పుడు హాలిడే కలిసొచ్చింది. ఈరోజు మిలాద్-ఉన్-నబీ కావడంతో, సినిమాకు మరిన్ని వసూళ్లు పెరగొచ్చని భావిస్తున్నారు.

ప్రస్తుతం యూత్ అంతా ఈ సినిమానే చూస్తున్నారు. మంచి కామెడీకి తోడు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, అదిరిపోయే ట్విస్టులతో టాక్సీవాలా అందర్నీ మెస్మరైజ్ చేస్తోంది. 3 రోజులకు గాను ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల 20 లక్షల రూపాయల షేర్ సాధించిన ఈ సినిమా.. ఈ హాలీడే ను మరింతగా క్యాష్ చేసుకుంటుందని ట్రేడ్ ఎక్స్ పెక్ట్ చేస్తోంది.

టాక్సీవాలా 3 రోజుల షేర్
నైజాం -రూ. 3.79 కోట్లు
సీడెడ్ – రూ. 0.93 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.95 కోట్లు
ఈస్ట్ – రూ. 0.48 కోట్లు
వెస్ట్ – రూ. 0.44 కోట్లు
గుంటూరు – రూ. 0.64 కోట్లు
కృష్ణా – రూ. 0.61 కోట్లు
నెల్లూరు – రూ. 0.25 కోట్లు