ఈ వీకెండ్ రిలీజెస్

Tuesday,February 20,2018 - 12:42 by Z_CLU

లాస్ట్ వీక్ రిలీజైన సినిమాల జోరు ఇంకా తగ్గనే లేదు. అప్పుడే కొత్త సినిమాలతో ఈ వీకెండ్ కూడా రెడీ అయిపోయింది. ఈ శుక్రవారం 5 సినిమాలు రిలీజవుతున్నాయి. హారర్ తో పాటు యూత్ ఫుల్ కంటెంట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగడానికి రెడీగా  ఉన్న సినిమాలివే…

 స్కెచ్

విక్రమ్, తమన్నా జంటగా నటించిన సినిమా ‘స్కెచ్’. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇదే మొదటి సినిమా కాగా, తను రెగ్యులర్ గా చేసే ప్రయోగాలకు భిన్నంగా కంప్లీట్ మాస్ లుక్ లో విక్రమ్ చేసిన సినిమా ఇది. తమిళ్ లో ఇప్పటికే విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు  తెలుగులో విడుదలకు సిద్ధమైంది. విజయ్ చందర్ ఈ సినిమాకి దర్శకుడు. తమన్ సంగీతం అందించాడు.

 

 జువ్వ

 రంజిత్, పాలక్ లల్వానీ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం జువ్వ. గతంలో దిక్కులు చూడకు రామయ్య అనే సినిమాను డైరక్ట్ చేసిన త్రికోటి ఈ సినిమాకు దర్శకుడు. కీరవాణి సంగీతం అందించినే ఈ సినిమాకు ఎమ్.రత్నం, కథ-మాటలు సమకూర్చారు.

 రా..రా

హారర్-కామెడీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా రా..రా. ఈ తరహా చిత్రంలో నటించడం హీరో శ్రీకాంత్ కు ఇదే ఫస్ట్ టైం. సినిమాలో శ్రీకాంత్ సరసన నజియా హీరోయిన్ గా నటించింది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. V.G. చెరిష్ నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి రాప్ రాక్ షకీల్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

 హైదరాబాద్ లవ్ స్టోరీ 

రీసెంట్ గా హౌరా బ్రిడ్జ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రాహుల్ రవీంద్రన్.. ఈసారి ‘హైదరాబాద్ లవ్ స్టోరీ’ అనే మరో మూవీని సిద్దంచేశాడు. రేష్మి మీనన్, జియా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి రాజ్ సత్య దర్శకత్వం వహించాడు.

 ఈ సినిమాలతో పాటు చల్తే..చల్తే అనే మరో చిన్న సినిమా కూడా థియేటర్లలోకి వస్తోంది. వీటిలో ఎన్ని చిత్రాలు వీకెండ్ ఎట్రాక్షన్స్ గా నిలుస్తాయో చూడాలి.