వీకెండ్ రిలీజ్

Wednesday,November 06,2019 - 03:46 by Z_CLU

ఈ వీకెండ్ పెద్దగా సినిమాల సందడి లేదు. పేరుకి 7 సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ అందులో చెప్పుకోదగ్గ మూవీ మాత్రం ఒక్కటే. అదే శ్రీవిష్ణు తిప్పరామీసం. మిగతా సినిమాల్లో చెప్పుకోదగ్గవేమీ లేవు.

రేపు ఏడు చేపల కథ అనే సినిమా థియేటర్లలోకి వస్తోంది. అభిషేక్ రెడ్డి, బిగ్ బాస్ ఫేం భాను శ్రీ,, ఆయేషా సింగ్, నగరం సునీల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని చరిత సినిమా ఆర్ట్స్ పతాకం మీద డా.రాకేష్ రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్ రెడ్డి, జివిఎన్ నిర్మిస్తున్నారు. అడల్ట్ కంటెంట్ కు కాస్త కామెడీ యాడ్ చేసి ఈ సినిమా తీశారు. రెండు టీజర్లకు సోషల్ మీడియాలో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది.

ఏడు చేపల కథ రిలీజైన మరుసటి రోజు (శుక్రవారం) తిప్పరా మీసం థియేటర్లలోకి వస్తోంది. శ్రీవిష్ణు, నిక్కీ తంబోలీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు విజయ్ కృష్ణ దర్శకుడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ అందర్నీ కట్టిపడేస్తుందంటున్నాడు హీరో.

ఈ రెండు సినిమాలతో పాటు శివలింగాపురం, 4 ఇడియట్స్, కోనాపురంలో, గాలిపురం జంక్షన్, అగ్లీ లాంటి మరికొన్ని సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఏది క్లిక్ అవుతుందో చూడాలి.