దుబాయ్ లో చరిత్ర సృష్టించనున్న 2.0

Wednesday,November 21,2018 - 10:05 by Z_CLU

రజినీకాంత్ 2.0 ఫీవర్ జస్ట్ ఇండియాలోనే కాదు దుబాయ్ లో కూడా అదే స్థాయిలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 10,000 థియేటర్ లలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న మేకర్స్, దుబాయ్ లో ఒక్కరోజే ఏకంగా 100 షో లను ప్రదర్శించనున్నారు. దుబాయ్ హిస్టరీ లోనే ఇలా జరగడం మొట్ట మొదటిసారి. ఈ స్థాయిలో ఇప్పటి వరకు హాలీవుడ్ సినిమాలు కూడా రిలీజ్ కాలేదు.

ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ దృష్టి నవంబర్ 29 పై ఫిక్స్ అయి ఉంది. ఈ సినిమాపై క్రియేట్ అయి ఉన్న డిమాండ్ కి తగ్గట్టుగా భారీ స్థాయిలో సినిమాని రిలీజ్ చేస్తున్న మేకర్స్, దుబాయ్ లోని అతి పెద్ద మల్టీప్లెక్స్ V.O.X సినిమాస్ లో ఒకే రోజు 100 షోస్ ప్రదర్శించనున్నారు. అందుకోసం మార్నింగ్ 4:30 కే ఫస్ట్ షో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కింది 2.0. భారీ టెక్నికల్ ఎలిమెంట్స్ తో విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రజినీకాంత్ సరసన ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. A.R. రెహమాన్ మ్యూజిక్ కంపోజర్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.