The Rise Of Sivagami రిలీజయింది

Friday,January 20,2017 - 03:05 by Z_CLU

బాహుబలి బుక్ ఫస్ట్ సిరీస్ రిలీజయింది. ‘The Rise Of Sivagami’ ఆనంద్ నీలకంఠన్ రాసిన ఈ బుక్ ని ఇంతకు ముందే అనౌన్స్ చేసినట్టు ‘జీ జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’ లో రాజమౌళి, రానా, ప్రొడ్యూసర్ ప్రసాద్ దేవినేని కలిసి గ్రాండ్ గా రిలీజ్ చేశారు.

సినిమాలో చూసినట్టు బాహుబలి బిగినింగ్ లో తల్లి శివగామి గా తన పరిచయం జరిగితే, ఈ Before The Beginning లో కథ ఇంకో సిరీస్ ముందు నుండి బిగిన్ అవుతుంది. అంటే శివగామి గత జీవితం గురించి,  రాజు గారి మరణం తరవాత శివగామి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది..?లాంటి ఇంటరెస్టింగ్  పాయింట్స్   పై ఈ బుక్ లో ఇంకా డెప్త్  గా  డిస్కషన్ జరుగుతుంది.

‘The Rise Of Sivagami’ బుక్ రిలీజ్ అని అనౌన్స్ చేసినప్పుడే సరికొత్త ఉత్కంఠ క్రియేట్ అయి రిలీజ్ కి ముందే డిమాండ్ ని పెంచుకుంది. చూస్తుంటే సినిమా లాగే బుక్ సిరీస్ కూడా సూపర్ హిట్ అయ్యే చాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

baahubali-book-1