ప్రభాస్ గుడ్ బై చెప్పేశాడు

Friday,January 06,2017 - 12:00 by Z_CLU

బాహుబలి ప్యాకప్ చెప్పేశాడు. షూటింగ్ పూర్తయింది… గుమ్మడి కాయ కొట్టేశాం అన్న కన్ఫర్మేషన్ అయితే రాజమౌళి ఇవ్వలేదు కానీ, ప్రభాస్ పార్ట్ కంప్లీట్ అయింది అని ట్వీట్ చేశాడు.

దాదాపు మూడున్నరేళ్ళ డెడికేషన్, బహుశా ఏ స్టార్ హీరో కూడా ఇన్నేళ్ళ కమిట్ మెంట్ ఏ డైరెక్టర్ కి ఇవ్వడేమో. ప్రభాస్ బాహుబలి సినిమా కోసం చేశాడు. రాజమౌళి ఆ విషయాన్ని కూడా మెన్షన్ చేస్తూ, స్పెషల్ గా డార్లింగ్ కి థ్యాంక్స్ చెప్పుకున్నాడు.

ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బాహుబలి, దాదాపు షూటింగ్ చివరి దశలో ఉంది. ఓ వైపు షూటింగ్ జరుపుకుంటూనే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న బాహుబలి-కంక్లూజన్ అంతకు ముందే అనౌన్స్ చేసినట్టు ఏప్రిల్ 28 రిలీజ్ వైపు ఫాస్ట్ ఫాస్ట్ గా మూవ్ అవుతుంది.