బాహుబలి సినిమాలో తెరకెక్కని నిజాలు

Tuesday,April 11,2017 - 03:50 by Z_CLU

రాజమౌళి బాహుబలి లాంటి సినిమా తీయాలి అని ఎప్పుడు కల కన్నాడో కానీ ఆ కలని తెరకెక్కించడానికి ఐదేళ్ళ కాలం పట్టింది. కథ డెవలప్ చేయడం దగ్గరి నుంచి కంక్లూజన్ వరకు ఫుల్లీ డెడికేటెడ్ గా పని చేసిన సినిమా యూనిట్ ఈ ఐదేళ్ల కాలంలో తెర వెనుక చవిచూసిన అనుభవాలెన్నో…

 టైమ్ టు టైమ్

ఎవ్రీ మార్నింగ్ బాహుబలి టీమ్ సెట్స్ పైకి రావాల్సిన ఎగ్జాక్ట్ టైమ్ మార్నింగ్ 7 గంటలు. అంటే ఈ లోపు ఆర్టిస్టులైతే మేకప్ తో సహా రెడీగా ఉండాలి. కాబట్టి మినిమం ఐదింటికి సెట్స్ పైకి రాకపోతే వర్కవుట్ కాదు. ఇక లైట్ మెన్ దగ్గరి నుండి హై ప్రొఫైల్ టెక్నీషియన్స్ వరకు కనీసం గంట ముందు కావాల్సిన సరంజామాతో 6 గంటలకు సెట్ లో ఉండాల్సిందే. ఐదేళ్ళుగా ఇది ఫిక్స్డ్ టైం టేబుల్.

120 రోజులు యుద్ధమే 

బాహుబలిలో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ వార్ సీక్వెన్సెస్. ఈ యుద్ధం సీన్స్ ని తెరకెక్కించడానికి 120 రోజుల పాటు రెగ్యులర్ షూటింగ్ చేసింది సినిమా యూనిట్. ఈ షెడ్యూల్ లో జస్ట్ 2 రోజులు మాత్రమే బ్రేక్ తీసుకుంది సినిమా యూనిట్.

ఇన్ డోర్ నో ప్యాకప్

 బాహుబలి అవుట్ డోర్  షూటింగ్ టైమ్ లో కంపల్సరీగా సాయంత్రం 6 గంటలకు ప్యాకప్ చెప్పాలి. లైట్ లేకపోతే ప్లాన్ చేసుకున్న టోన్ లో సీన్స్ తెరకెక్కవు. అదే ఇన్ డోర్ లో షూటింగ్స్ జరుగుతున్నప్పుడు, లైట్స్ దగ్గరి నుండి ప్రతీది టెక్నీషియన్స్ చేతుల్లో ఉంటుంది కాబట్టి,  సినిమా యూనిట్ కి కనీసం ప్యాకప్ చెప్పే ఆలోచన కూడా చాలా కష్టంగా వచ్చేదట. సీన్ తర్వాత సీన్స్ తెరకెక్కించే పనిలో ఒక్కోసారి 24 గంటలు షూటింగ్ జరుగుతూనే ఉండేది.

ఆన్ లొకేషన్ డెసిషన్స్ 

మహాబలేశ్వరం సినిమా షెడ్యూల్ చేసుకున్నప్పుడు మొత్తం బాహుబలి సినిమా యూనిట్ టైం ప్రకారం లొకేషన్ కి చేరుకున్నాక ఒక్కసారిగా వర్షం కురవడం మొదలైందట. దాంతో షూటింగ్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుందేమో, రీసోర్సెస్ వేస్ట్ అవుతాయేమో అనుకునే టైం లో, స్పాట్ లో సీన్స్ మోడ్ చేంజ్ చేసేసి అదే లైట్ లో సీన్స్ షూట్ చేసుకుంది సినిమా యూనిట్. ఇలా చెప్పుకుంటూ పోతే బాహుబలి షూటింగ్ జరిగిన ఈ మూడున్నరేళ్లలో ఎన్నో మరపురాని ఘటనలు ఉన్నాయంటోంది సినిమా యూనిట్.