వినాయక్ డైరెక్షన్ లో సాయి ధరం తేజ్

Friday,January 20,2017 - 01:40 by Z_CLU

మెగా డైరెక్టర్ వి.వి.వినాయక్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని మళ్ళీ మెగా కాంపౌండ్ లోనే ప్లాన్ చేస్తున్నాడా..? ఈ క్వశ్చన్ కి క్లారిటీ అయితే రాలేదు కానీ వి.వి.వినాయక్, సాయి ధరమ్ తేజ్ తో సినిమాని ప్లాన్ చేస్తున్నాడనే టాక్, ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతానికి ఖైదీ సక్సెస్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న వి.వి.వినాయక్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయం అఫీషియల్ గా ఎక్కడా మాట్లాడలేదు. ప్రస్తుతం ఖైదీ మానియాతో కిక్కిరిసిన మెగా ఫ్యాన్స్ లో ఈ టాక్, చిన్న సైజు వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేస్తుంది.

ఈ టాక్ లో ఎంత వాస్తవం ఉందో తెలీదు కానీ, ఈ న్యూస్ కానీ నిజమైతే తేజు ఎనర్జీకి, వినాయక్ అవుట్ స్టాండింగ్ విజన్ జతైతే మరో అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ కి రిబ్బన్ కట్ చేసినట్టే అవుతుంది. మరి ఈ న్యూస్ జస్ట్ రూమర్ గానే మిగిలిపోతుందా..? అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో కన్ఫం అవుతుందా వెయిట్ చేస్తే కానీ తెలీదు.