ప్రపంచ వేదికపై బాహుబలి

Wednesday,March 01,2017 - 05:08 by Z_CLU

ఏప్రిల్ 28…  ప్రపంచం మొత్తం ఈ డేట్ కోసం ఎప్పుడో కౌంట్ డౌన్ బిగిన్ చేసేసింది. ఓ వైపు ‘బాహుబలి కంక్లూజన్’ రిలీజ్ డేట్ కి ఒక్కో రోజు దగ్గర పడుతున్నా, ఆల్రెడీ రిలీజ్ అయిన బాహుబలి మాత్రం తన క్రేజ్ ఏ మాత్రం తగ్గిందనిపించుకోవడం లేదు. ఇండియన్ సినిమా స్టామినాని ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళిన బాహుబలి, మరో అత్యంత గౌరవప్రదమైన ప్రపంచ వేదికపై ప్రదర్శించబడటానికి రెడీ అవుతుంది.

బ్రిటీష్ కౌన్సిల్ తో పాటు, U.K గవర్నమెంట్, ఇండియన్ హై కమీషన్ జాయింట్ గా సెలెబ్రేట్ చేస్తున్న UK- ఇండియా కల్చరల్ ఈవెంట్స్ లో బాహుబలి సినిమాని ప్రదర్శించాలని నిర్ణయం తీసుకుంది కౌన్సిల్. ఏప్రియల్ నుండి బిగిన్ అయి డిసెంబర్ వరకు జరిగే ఈ సెలెబ్రేషన్స్ లో ఈ సినిమాతో పాటు, అటు యునైటెడ్ కింగ్ డమ్ తరఫున మరియు ఇండియా తరఫున ఇలాంటి మరెన్నో ఆక్టివిటీస్ ఉంటాయి.

 

ఇంత హంగామా జరుగుతున్నా, బాహుబలి సినిమా యూనిట్ మాత్రం ఆల్రెడీ అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ ని రీచ్ అవ్వడం కోసం కష్టపడుతోంది. ప్రస్తుతం యూనిట్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ‘బాహుబలి – ది కంక్లూజన్’ మూవీ ఏప్రిల్ 28 న వరల్డ్ వైడ్ గా రిలీజవుతుంది.