లీక్ చేసిన గ్రాఫిక్ డిజైనర్ అరెస్టయ్యాడు

Wednesday,November 23,2016 - 10:36 by Z_CLU

బాహుబలి సినిమా మొత్తం ఒక ఎత్తు, సినిమాలో యుద్ధ సన్నివేశాలు ఒక ఎత్తు. బాహుబలి సినిమాతో,  ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు తిరిగి చూసేలా చేసిన రాజమౌళి బాహుబలి – కంక్లూజన్ ని దానికన్నా అద్భుతంగా  తెరకెక్కించే పనిలో పడ్డాడు. కొన్నివేల మంది ఈ అద్భుతం తెరకెక్కడానికి రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. అలాంటిది అంత కష్టపడి, అన్ని కోట్లు పెట్టి షూట్ చేసిన ఫూటేజ్ ని సిల్లీగా తీసుకున్న గ్రాఫిక్ డిజైనర్ ఇంటర్ నెట్ లో 6 నిమిషాల ఫూటేజ్ ని రిలీజ్ చేసి ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్నాడు.

బాహుబలి క్లైమాక్స్ సీన్ ని లీక్ చేసిన అసిస్టెంట్ గ్రాఫిక్ డిజైనర్ దయానంద్ చౌదరి అరెస్టయ్యాడు. ఎడిటింగ్ సర్వర్ నుండి ఫూటేజ్ ని తీసుకున్న దయానంద్ ఆ ఫూటేజ్ ని విజయవాడలో ఉంటున్న తన ఫ్రెండ్స్ తో షేర్ చేసుకున్నాడు. ఆ షేరింగ్ అక్కడితో ఆగకుండా ఏకంగా యూ ట్యూబ్ వరకు వెళ్ళింది.

ఇంటర్ నెట్ లో వీడియో లీకయిందన్న విషయం తెలుసుకున్న సినిమా యూనిట్ ఇమ్మీడియట్ గా ఆ సీన్స్ ని ఇంటర్ నెట్ నుండి రిమూవ్ చేయించారు. బాహుబలి సెట్స్ లో మామూలుగా సినిమా యూనిట్ మెంబర్స్ కి తప్ప ఎవరికీ అనుమతి ఉండదు. కనీసం సెల్ ఫోన్స్ ని కూడా అనుమతించరు. గ్రాఫిక్స్ సెక్షన్ లోను చాలా జాగ్రత్తగా ఉండే సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ ఇంత పెద్ద తప్పును ఎలా అడ్డుకోలేకపోయిందో వారికి కూడా అంతు పట్టడం లేదు.