ఈ ఇయర్ సంక్రాంతి పోటీ లో మెగా స్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ తమ ప్రెస్టీజియస్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడి భారీ కలెక్షన్స్ సాధిస్తూ ముందుకెళ్తున్నారు. జనవరి లో సీనియర్ హీరో లు తమ జోరు చూపిస్తుండడంతో యంగ్ హీరోలంతా ఫిబ్రవరి లో తమ సినిమాలను థియేటర్స్ కు తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. అలా ఫిబ్రవరి లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్న యంగ్ హీరోస్ పై ఓ లుక్కేద్దాం.
ఈ లిస్ట్ ముందున్నాడు నేచురల్ స్టార్ నాని. ప్రెజెంట్ టాలీవుడ్ లో వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్న నాని ‘నేను లోకల్’ సినిమాతో ఫిబ్రవరి 3 నుంచి హంగామా చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే సాంగ్స్ ట్రైలర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్న ఈ యంగ్ హీరో ఈ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.
ఈ ఇయర్ ఫిబ్రవరి లిస్ట్ లో మంచు విష్ణు కూడా ‘లక్కున్నోడు’ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర తన లక్ ను టెస్ట్ చేసుకోబోతున్నాడు. గతం లో ‘గీతాంజలి’ వంటి సూపర్ హిట్ సినిమాను డైరెక్ట్ చేసిన రాజ్ కిరణ్ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా కూడా ఫిబ్రవరి 3న థియేటర్స్ లోకి రానుంది.
ఈ ఫిబ్రవరి లో మంచు మనోజ్ ‘గుంటూరోడు’ గా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. ఎస్.కె.సత్య దర్శకత్వం లో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 17 న థియేటర్స్ లోకి అడుగుపెట్టనుంది.
టాలీవుడ్ యంగెస్ట్ హీరో రాజ్ తరుణ్ కూడా ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ అనే లవ్ ఎంటర్టైనర్ తో ఈ ఫిబ్రవరి లో ఆడియన్స్ ఎంటర్టైన్ చేసి తన ఖాతాలో మరో సూపర్ హిట్ వేసుకోవాలని చూస్తున్నాడు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. ఫిబ్రవరి 17 నుంచి కిట్టు ఎంటర్టైన్ చేస్తున్నాడు అనిపించుకోవాలని చూస్తున్నాడు ఈ యంగ్ హీరో.
ఇక ఈ ఫిబ్రవరి 17 న మరో యంగ్ హీరో కూడా థియేటర్స్ లో హంగామా చేయడానికి రెడీ అవుతున్నాడు నిఖిల్. లేటెస్ట్ గా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో గ్రాండ్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో ఫిబ్రవరి లో మరో డిఫరెంట్ మూవీ ‘కేశవ’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఫిబ్రవరి ఎండింగ్ లో ‘విన్నర్’ సినిమాతో విన్నర్ అనిపించుకోవాలని భావిస్తున్నాడు సాయి ధరమ్ తేజ్. గోపి చంద్ మలినేని డైరెక్షన్ లో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ లవ్ ఎంటర్టైనర్ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది.
జనవరి లో సీనియర్ హీరోస్ తమ సినిమాలతో థియేటర్స్ లో గట్టి సందడి చేయగా ఫిబ్రవరి లో ఆ సందడి ని ముందుకుతీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు టాలీవుడ్ యంగ్ హీరోస్. మరి ఈ సినిమాలతో ఈ యంగ్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాలు అందుకుంటారో? చూడాలి..