ఓవర్సీస్ లో టాక్సీవాలా దూకుడు

Thursday,November 22,2018 - 12:22 by Z_CLU

తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ అయిన టాక్సీవాలా సినిమా ఓవర్సీస్ లో కూడా అదే దూకుడు చూపిస్తోంది. విడుదలైన 4 రోజులకే అమెరికాలో ఈ మూవీ హాఫ్ మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ఓవర్సీస్ లో 5 లక్షల 87 వేల డాలర్ల వసూళ్లతో స్టడీగా నడుస్తోంది.

ఈ వీకెండ్ కూడా టాక్సీవాలాకు ఓవర్సీస్ లో పెద్దగా పోటీలేదు. ఏకంగా 4 సినిమాలు విడుదలవుతున్నప్పటికీ అవన్నీ లిమిటెడ్ స్క్రీన్స్ కే పరిమితమయ్యాయి. దీంతో మరో 3 రోజుల పాటు టాక్సీవాలా నిలకడగా వసూళ్లు సాధించే ఛాన్స్ ఉంది.

ఇక వరల్డ్ వైడ్ వసూళ్లు చూస్తే.. మొదటిరోజే 10 కోట్ల రూపాయల గ్రాస్ తో దుమ్ముదులిపిన ఈ సినిమా.. తాజాగా 25 కోట్ల రూపాయల గ్రాస్ తో సరికొత్త రికార్డు సృష్టించింది. మీడియం రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఓ సినిమా, వారం కూడా తిరక్కముందే పాతిక కోట్ల గ్రాస్ సాధించడం ఓ రికార్డు.

రాహుల్ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. ప్రియాంక జవాల్కర్ ఈ మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది. గీతాఆర్ట్స్-2, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై కంబైన్డ్ గా తెరకెక్కిన ఈ సినిమాకు SKN నిర్మాత.