టాక్సీవాలా – సక్సెస్ ఫుల్ గా మూడోవారం

Thursday,December 06,2018 - 03:18 by Z_CLU

నవంబర్ 17 న రిలీజయింది విజయ్ దేవరకొండ టాక్సీవాలా. ఇంట్రెస్టింగ్ బజ్ మధ్య రిలీజైన ఈ సినిమా సక్సెస్  ఫుల్ గా థర్డ్ వీక్ లోకి ఎంటరయింది. డిఫెరెంట్ స్టోరీలైన్ తో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసిన టాక్సీవాలా, ఇప్పటికి  కూడా అదే రేంజ్ లో మెస్మరైజ్ చేస్తుంది.

దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ స్క్రిప్ట్ దశలోనే యూత్ నుండి ఫ్యామిలీస్ వరకు కావాల్సిన ఎలిమెంట్స్ ని ప్లాన్డ్ గా బ్లెండ్ చేయడం ‘టాక్సీవాలా’ సినిమాని లాంగ్ రన్ లో ప్రదర్శింపబడేలా చేస్తుంది. ఈ సినిమాతో ఫ్యామిలీస్ కి కూడా హార్ట్ ఫేవరేట్ గా మారిపోయాడు విజయ్ దేవరకొండ. మరీ ముఖ్యంగా మాళవిక నాయర్ క్యారెక్టర్ కి బోలెడన్నీ ప్రశంసలు దక్కుతున్నాయి.

ఈ సినిమాని S.K.N. నిర్మించాడు. జేక్స్ బిజాయ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. గీతా ఆర్ట్స్ 2, UV పిక్చర్స్ బ్యానర్స్ సమర్పించిన ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది.