టాక్సీవాలా నా నమ్మకాన్ని నిజం చేసింది – మాళవిక నాయర్

Friday,November 23,2018 - 10:31 by Z_CLU

కీ రోల్ ప్లే చేసింది మాళవిక నాయర్ ‘టాక్సీవాలా’ లో. విజయ్ దేవరకొండ తరవాత ఇమ్మీడియట్ గా సినిమాలో అదే రేంజ్ లో మెస్మరైజ్ చేసిన ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ శిశిర క్యారెక్టర్. మ్యాగ్జిమం కథ ఈ క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది. అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్ ని ప్లే చేసిన మాళవిక తన కరియర్ విషయంలో చాలా క్లారిటీగా ఉంది. ఈ ‘టాక్సీవాలా’ సక్సెస్ నా నమ్మకాన్ని నిజం చేసింది అని చెప్పుకుంటుంది.

‘ఏ సినిమా అయినా ఓకె చెప్పేముందు 2 పాయింట్స్ మైండ్ లో పెట్టుకుంటా. మొదటిది నేను పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉందా లేదా..?, రెండవది నేను ప్లే చేసే రోల్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా..?లేదా..? టాక్సీవాలా సినిమా విషయంలో నేను ఎగ్జైటెడ్ అవ్వడానికి రీజన్ శిశిర క్యారెక్టర్. సినిమా రిలీజ్ తరవాత శిశిర క్యారెక్టర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, నా చాయిస్ కరెక్టని ప్రూఫ్ అయింది..” అని సంబరంగా చెప్పుకుంటుంది మాళవిక.

ఓ వైపు స్టడీస్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకుంటూనే కరియర్ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్న మాళవిక, టాక్సీవాలా సక్సెస్ తన డెసిషన్ మేకింగ్ పై మరింత కాన్ఫిడెన్స్ ని పెంచేసింది అంటూ మురిసిపోతుంది. ఇమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి రాహుల్ సంక్రిత్యాన్ డైరెక్టర్.