2.0 కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ఇంటర్వ్యూ

Wednesday,November 21,2018 - 01:30 by Z_CLU

ఇండియాస్ మోస్ట్ అవేటెడ్ మూవీ 2.0. దర్శకుడు శంకర్ నుండి వస్తున్న ఈ విజువల్ వండర్ ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే క్యూరియాసిటీ వరల్డ్ వైడ్ గా ఉంది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాలోని ప్రతి క్రాఫ్ట్ ని గ్రాండ్ గా ఎగ్జిక్యూట్ చేశారు ఫిల్మ్ మేకర్స్. ఒక్క ‘యంతర లోకపు..” సాంగ్ కే ఏకంగా 20 కోట్లు ఖర్చు పెట్టారంటే, సినిమాని ఏ స్థాయిలో తెరకెక్కించారన్నది గెస్ చేయవచ్చు. ఈ సాంగ్ ని కంపోజ్ చేసిన హాలీవుడ్ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకున్నాడు.

ఎవరికైనా అదే ఫీలింగ్…

శంకర్ లాంటి విజనరీ డైరెక్టర్ తో పని చేయడమంటే ఎంతటి కొరియోగ్రాఫర్ అయినా అదృష్టంగా ఫీల్ అవుతాడు. ఎలాంటి వారినైనా తన స్థాయికి తగ్గట్టు, తన విజన్ కి తగ్గటు ట్రాన్స్ ఫామ్ చేసి పని చేయించుకోగల సత్తా శంకర్ కి ఉంది.

నేనే కొరియోగ్రాఫర్…

నిజానికి ‘రోబో’ సినిమాకి కూడా పని చేయాలి. కానీ డేట్స్ మ్యానేజ్ చేసుకోలేకపోవడం వల్ల ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో చాలా ఫీల్ అయ్యాను. కానీ ఆ తరవాత విక్రమ్ ‘ఐ’ సినిమాకి పని చేశాను.  ఆ సినిమాలో 2 పాటలకు నేనే కొరియోగ్రాఫర్.

శంకర్ కి టైమ్ ఇస్తే…

శంకర్ సినిమాకి పని చేస్తే జస్ట్ సాంగ్ కంపోజ్ చేశాము అన్న ఫీలింగ్ ఉండదు. తనకేం కావాలో క్లారిటీ ఇస్తూనే, కొరియోగ్రాఫర్స్ కి వారి వారి రేంజ్ లో ఎక్స్ ప్లోర్ చేసే అవకాశాన్ని ఇస్తాడు. అందుకే శంకర్ సినిమా కోసం ఎంత టైమ్ ఇచ్చినా, ఇబ్బంది అనిపించదు.

మైండ్ లో ఉన్న పాయింట్స్…

‘యంత్ర లోకపు..’ సాంగ్ కంపోజ్ చేయాలనుకున్నప్పుడు మైండ్ లో ఉన్న పాయింట్స్ రెండే రెండు. మొదటిది రజినీకాంత్ ఏజ్ ని మైండ్ లో పెట్టుకోవాలి. రెండవది సాంగ్ లో ఉండే మూవ్స్ అన్ని రోబోటిక్ స్టైల్ లో ఉండాలి.

రజినీకాంత్ గ్రేస్

సాంగ్ లో ఏ స్టెప్ కంపోజ్ చేసిన రజినీకాంత్ బాడీ లాంగ్వేజ్ ని మైండ్ లో పెట్టుకుని ప్లాన్ చేసుకున్నాం. కానీ ఆ స్టెప్స్ కి రజినీకాంత్ ఆడ్ చేసిన గ్రేస్ అంతా ఇంతాకాదు. స్పెషల్ గా ఆయన నడిచే పద్ధతి జస్ట్ మైండ్ బ్లోయింగ్. మేము కంపోజ్ చేసిన స్టెప్స్ లో కనీసం ఒక్కటి కూడా మార్చమని అడగలేదు.. అంతే ఎనర్జిటిక్ గా పర్ఫామ్ చేశాడు.

ఎమీ జాక్సన్ కమిట్ మెంట్…

ఎమీ జాక్సన్ డ్యాన్స్ విషయంలో అంత కాన్ఫిడెంట్ గా ఉండదు. కానీ ఈ సినిమా కోసం తనను తాను చాలా ఇంప్రూవ్ చేసుకుంది. తన కమిట్ మెంట్ ని డెఫ్ఫినేట్ గా అభినందించాలి. మరీ ముఖ్యంగా రోబోటిక్ బాడీ లాంగ్వేజ్ కోసం చాలా కష్టపడింది.

విలువ తెలుసు కాబట్టే…

హెవీ బడ్జెట్.. వ్యాల్యూబుల్ టైమ్.. ఫ్యాన్స్ లో ఉన్న ఎక్స్ పెక్టేషన్స్.. ప్రతీది మైండ్ లో పెట్టుకుని సాంగ్ కంపోజ్ చేశాం. మేం పడ్డ కష్టం సాంగ్ లోని ప్రతి మూవ్ లో, షాట్ లో మీరు చూడగలుగుతారు. ఫీస్ట్ లా ఉండబోతున్నాయి సాంగ్ విజువల్స్.

అదీ శంకర్…

దర్శకుడు శంకర్ ఆయన సినిమాల గురించి రిలీజ్ కి ముందు పెద్దగా మాట్లాడరు. సినిమా రిలీజయ్యాక సినిమా స్థాయి ఏంటనేది ఆడియెన్స్ గుర్తిస్తారు. 2.0 దేశం గర్వపడే సినిమా అవుతుంది. నాకా నమ్మకం ఉంది.

గర్వంగా ఫీలవుతున్నా…

2.0 సినిమాలో పని చేసినందుకు నిజంగా గర్విస్తున్నా.