20 కోట్ల మార్క్ ని రీచ్ అయిన టాక్సీవాలా

Tuesday,November 27,2018 - 03:57 by Z_CLU

‘టాక్సీవాలా’ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. రాహుల్ సంక్రిత్యాన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే 20 కోట్ల (షేర్) వసూలు చేసింది. విజయ్ కి ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ కి తోడు, సినిమాలోని ఎంటర్ టైనింగ్ వ్యాల్యూస్ సినిమాని ఈజీగా  సక్సెస్ ట్రాక్ పై నిలబెట్టేశాయి.

ఇప్పటికే క్రేజ్ ఫుల్ ఇమేజ్ తో ఫ్యాన్స్ కి దగ్గరైన  విజయ్ దేవరకొండని ఇమోషనల్ ఆంగిల్ లోను పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసింది టాక్సీవాలా. దర్శకుడు రాహుల్ మరీ హారర్ ఎలిమెంట్స్ పై ఫోకస్ పెట్టకుండా, కథని ఇమోషనల్ గా డ్రైవ్ చేసిన విధానం ఫ్యామిలీస్ ని కూడా థియేటర్స్ కి రప్పిస్తుంది. ఈ వరసలో గ్రాఫిక్స్ కూడా తన రేంజ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి.

ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మాళవిక నాయర్ ఇంట్రెస్టింగ్ రోల్ ప్లే చేసింది. జేక్స్ బిజాయ్ సాంగ్స్ సినిమా రిలీజ్ కి ముందు ఎంత ఎట్రాక్ట్ చేశాయో, సినిమాలోని కీ సిచ్యువేషన్స్ లో ఉన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి మరింత లైఫ్ ని ఆడ్ చేసింది. ఈ సినిమాకి S.K.N. నిర్మాత.