ఇప్పుడు విజయ్ దేవరకొండ వంతు...

Friday,February 08,2019 - 03:36 by Z_CLU

ఈ రోజు విజయ్ దేవరకొండకి ఏ స్థాయిలో క్రేజ్ ఉన్నా, ఎన్ని బ్లాక్ బస్టర్స్ రికార్డ్ అయినా ఈ క్రేజీ హీరో కరియర్ ట్రాక్ లో పడింది మాత్రం ‘పెళ్ళిచూపులు’ సినిమాతోనే. ఈ డ్యాషింగ్ హీరోని ఫుల్ ఫ్లెజ్డ్ గా ప్రెజెంట్ చేసిన క్రెడిట్ తరుణ్ భాస్కర్ కే దక్కుతుంది. అందుకే ఈ సారి తరుణ్ భాస్కర్ ని అదే స్థాయిలో హీరోగా లాంచ్ చేసే రెస్పాన్సిబిలిటీని విజయ్ దేవరకొండ తీసుకున్నాడు.

రీసెంట్ గా ‘కింగ్ ఆఫ్ ది హిల్’ అని తన బ్యానర్ ని ఇంట్రడ్యూస్ చేసిన విజయ్ దేవరకొండ, ఈ బ్యానర్ లో నిర్మాతగా తన ఫస్ట్ మూవీని అనౌన్స్ చేశాడు. నిన్న పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంచ్ అయింది. ఈ సినిమా స్టోరీలైన్ లాంటివి ఇంకా రివీల్ చేయలేదు కానీ, తరుణ్ భాస్కర్ ఈ సినిమాతో హీరోగా తన కరియర్ ని బిగిన్ చేయనున్నాడు.

గతంలో ‘మహానటి’ సినిమాలో సింగీతం శ్రీనివాస్ గారిలా కాసేపు కనిపించి మెస్మరైజ్ చేసిన తరుణ్ భాస్కర్, ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడు..? తన డైరెక్షన్ లో వచ్చే సినిమాల్లో మ్యాగ్జిమం యూత్ రిలేటెడ్ టాపిక్స్ ఎంచుకునే  తరుణ్ భాస్కర్, నటుడిగా కూడా అదే ఫార్ములా ఫాలో అవుతాడా..? లేకపోతే ఆల్ రౌండర్ అనిపించుకుంటాడా..? అనేది చూడాలి. ఈ సినిమాతో షమ్మీర్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.