Exclusive: యంగ్ ఎన్టీఆర్ గా తరుణ్

Friday,February 08,2019 - 01:07 by Z_CLU

ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాకు సంబంధించి ఎక్స్ క్లూజివ్. ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్-2లో యంగ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉందట. ఈ పాత్ర కోసం కన్నడ నటుడు తరుణ్ ను తీసుకున్నారు. ఆల్రెడీ రామోజీ ఫిలింసిటీలో 2 రోజుల షూటింగ్ జరిగింది. మరో 2 రోజుల షూట్ పెండింగ్ ఉంది.

మహానాయకుడు సినిమా పూర్తిగా రాజకీయాలకు సంబంధించినది కాదు. ఇందులో కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉందట. యంగ్ ఎన్టీఆర్ గా తరుణ్, టీనేజ్ బసవతారకం పాత్రలో మరో నటి గ్రీష్మ కనిపిస్తారట. ఆ సన్నివేశాలు సెకెండ్ పార్టులో వస్తాయట.

లెక్కప్రకారం ఎన్టీఆర్-మహానాయకుడు సినిమా ఈపాటికి రిలీజ్ అవ్వాలి. కానీ సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. త్వరలోనే విడుదల తేదీని అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.