పాయల్ రాజ్ పుత్ తీసుకున్న ఒక్క నిర్ణయం

Friday,February 08,2019 - 05:32 by Z_CLU

RX 100 సినిమాకి సంతకం చేసినప్పుడు కూడా ఈ రేంజ్ సెన్సేషనల్ హీరోయిన్ అనిపించుకుంటానని ఎక్స్ పెక్ట్ చేసి ఉండదు పాయల్ రాజ్ పుత్. జస్ట్ ఒక్క సినిమాతోనే యూత్ మైండ్ లో పర్మనెంట్ ప్లేస్ క్రియేట్ చేసుకుంది. ఒకరకంగా చెప్పాలంటే ఫస్ట్ సినిమాలో గ్రే షేడ్స్ ఉన్న రోల్ లో ఇంట్రడ్యూస్ అవ్వడమన్నది రిస్కే. ఆ డేరింగ్ డెసిషనే పాయల్ ని టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ చేసింది.

ప్రస్తుతం మాస్ మహారాజ్ సరసన ‘డిస్కో రాజా’ సినిమాలో నటిస్తుంది. మరోపక్క తేజ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘సీత’ సినిమాలో సిచ్యువేషనల్ గా ఉండబోయే ఐటెమ్ సాంగ్ లో కనిపించనుంది. వీటితో పాటు మరో డెబ్యూ డైరెక్టర్ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలోను నటించనుంది పాయల్ రాజ్ పుత్. అయితే ఈ సినిమాలో రెగ్యులర్ హీరోయిన్ లా కాకుండా పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించనుంది.

అయితే ఈ సినిమాలతో పాటు మరో హాట్టెస్ట్ అప్డేట్ ఏంటంటే త్వరలో కింగ్ నాగార్జున సరసన స్క్రీన్ షేర్ చేసుకోనుంది పాయల్ రాజ్ పుత్. ఈ విషయంలో ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ, బంగార్రాజు సినిమాలో నాగ్ సరసన పాయల్ వన్ ఆఫ్ ది హీరోయిన్ గా ఫిక్సయిందనే న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఇది గనక నిజమైతే పాయల్ స్టాండర్డ్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళినట్టే.