మెగాస్టార్ ‘సైరా’ లో మరో హీరోయిన్ ఫిక్సయింది

Monday,April 16,2018 - 01:29 by Z_CLU

చిరంజీవి ‘సైరా’ మూవీ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో ఇప్పటికే నయనతార హీరోయిన్ గా ఫిక్సయింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్న  సినిమా యూనిట్, ఇప్పుడు తమన్నాని మరో హీరోయిన్ గా ఫిక్స్ చేసుకుంది.

తమన్నా ఈ సినిమాలో ఏ రోల్ ప్లే చేస్తుందో ప్రస్తుతానికి బయటికి రాలేదు కానీ, తమన్నా ప్లే చేస్తున్న ఈ క్యారెక్టర్ కోసం ఫిల్మ్ మేకర్స్ చాలా రీసర్చ్ చేసినట్టు తెలుస్తుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్, దేశం గర్వించే సినిమా అవుతుందని చెప్తున్న తమన్నా, ఈ సినిమాలో నటించే అవకాశం దొరకడం నిజంగా అదృష్టం అని చెప్పుకుంటుంది. గతంలో రామ్ చరణ్ ‘రచ్చ’ లో చెర్రీ సరసన జోడీ కట్టిన ఈ మిల్కీబ్యూటీ, ఇప్పుడు చిరు సరసన నటించే లక్కీ చాన్స్ కొట్టేయడం టాలీవుడ్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.

 

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతుంది ‘సైరా’. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా అఫీషియల్ గా కన్ఫమ్ కాలేదు.