నయనతార రావాల్సి ఉంది...

Friday,August 23,2019 - 02:26 by Z_CLU

‘సైరా’ మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. సినిమా టీజర్ ని రీసెంట్ గా బాలీవుడ్ లో రిలీజ్ చేయడం, లీడింగ్ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో ఇంటరాక్షన్స్  చేస్తుండటంతో న్యాచురల్ గానే బాలీవుడ్ ఆడియెన్స్ దృష్టిలో ‘సైరా’ ఈజీగా రిజిస్టర్ అయింది. అయితే వీటన్నింటిలో  నయనతార ఎక్కడా ఇన్వాల్వ్ అయినట్టు కనిపించలేదు.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో తమన్నా మాత్రమే యూనిట్ సభ్యులతో అటెండ్ అయింది. నిజానికి ‘సైరా’ లో తమన్నా ప్లే చేసింది కీ రోల్ అయినప్పటికీ నయనతారనే ఫస్ట్ ఫీమేల్ లీడ్. అలాంటిది నయన్ ఇప్పటిదాకా ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించలేదు.

నిజానికి ‘సైరా’ టీమ్ టాలీవుడ్ లో ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. ప్రస్తుతానికి ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టిన మేకర్స్, అక్కడ తమన్నా అయితేనే ప్రమోషన్స్ కి పర్ఫెక్ట్ అని ఫిక్సయినట్టున్నారు. ఇప్పటి వరకు నయన్ హిందీలో ఒక్క సినిమా చేయలేదు. అలాంటప్పుడు నయనతార కన్నా అక్కడ తమన్నా అయితేనే బెటర్ అని ఫిక్సయినట్టున్నారు.

 తమన్నాతో కంపేర్ చేస్తే నయనతార బిటౌన్ లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగే స్టార్ కాదు అది ఒప్పుకోవాల్సిందే. కానీ సౌత్ ఇండియాలో అలా కాదు. త్వరలో సౌత్ ఇండియాలో కూడా అగ్రెసివ్ గా ‘సైరా’ ను ప్రమోట్ చేయనుంది టీమ్. బహుశా ఈ ఫేజ్ లో నయనతార ఆక్టివ్ గా ఉంటుందేమో చూడాలి.