మెగాస్టార్ కి ఇది 4వ సినిమా

Wednesday,August 21,2019 - 11:02 by Z_CLU

మెగాస్టార్ ‘సైరా’ క్రేజ్ బాలీవుడ్ లో కూడా ఊపందుకుంటుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీ రోల్ ప్లే చేయడం దానికి తోడు మెగాస్టార్ చిరంజీవికి బాలీవుడ్ లో కూడా ఫ్యాన్ బేస్ ఉండడంతో రోజు రోజుకీ క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా 3 సినిమాలు చేసిన చిరంజీవికి… ‘సైరా’ 4 వ సినిమా. 

ప్రతిబంద్ : చిరంజీవి బాలీవుడ్ డెబ్యూ ఈ సినిమాతోనే జరిగింది. అప్పటి తెలుగు బ్లాక్ బస్టర్ సినిమా ‘అంకుశం’ కి రీమేక్ ఇది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మెగాస్టార్ ని సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేసింది. ఆ మార్క్ ఇప్పటికీ బాలీవుడ్ లో అలాగే ఉంది.

ఆజ్ కా గుండారాజ్ : తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ ‘గ్యాంగ్ లీడర్’ కి రీమేక్ ఇది. ఈ సినిమాకి రవిరాజా పినిశెట్టి డైరెక్టర్. ఈ సినిమా తెలుగులో ఏ స్థాయి సక్సెస్ అందుకుందో బాలీవుడ్ లో కూడా అదే స్థాయిలో నిలబడింది.

ద జెంటిల్ మెన్ – తెలుగు ‘జెంటిల్ మెన్’ కి హిందీ రీమేక్ ‘ద జెంటిల్ మెన్’. బాలీవుడ్ లీడింగ్ ఫిలిమ్ మేకర్ మహేష్ భట్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. 1994 లో ఈ సినిమా రిలీజైన తరవాత చిరు కంప్లీట్ ఫోకస్ టాలీవుడ్ పైనే పెట్టారు…  మళ్ళీ బాలీవుడ్ వైపు వెళ్ళలేదు…

ఇన్నాళ్ళ గ్యాప్ తరవాత ‘సైరా’ తో మళ్ళీ బాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్.. ఈ సినిమా ఇండియన్ ఫస్ట్ ఎవర్ ఫ్రీడమ్ ఫైటర్ ని ప్రపంచానికి గుర్తు చేస్తుందని… డెఫ్ఫినెట్ గా సక్సెస్ అందుకుంటుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.