మహానటి సగం సక్సెస్ అయినట్టే...

Monday,April 16,2018 - 03:00 by Z_CLU

సోషల్ మీడియాలో ‘మహానటి’ సీజన్ బిగిన్ అయింది. ఈ నెల 14 న రిలీజైన ఈ సినిమా టీజర్ కేవలం 36 గంటల్లో 30 లక్షల యూ ట్యూబ్ వ్యూస్ క్రాస్ చేసింది. 50 సెకన్ల పాటు ఉండే ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. యూ ట్యూబ్ తో పాటు తక్కిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై మోస్ట్ ఇంట్రెస్టింగ్ డిస్కర్షన్ ఎలిమెంట్ లా మారింది మహానటి.

సావిత్రి రోల్ లో  కీర్తి సురేష్ ఈ సినిమాలో ఏ రేంజ్ లో పర్ఫామ్ చేస్తుందోనన్న క్యూరాసిటీ ఫ్యాన్స్ లో బిగినింగ్ నుండే ఉంది. ఆ క్యూరాసిటీకి తగ్గట్టుగానే ఈ టీజర్ ని మరింత ఎట్రాక్టివ్ గా ప్రెజెంట్ చేయడం లో సక్సీడ్ అయ్యారు ‘మహానటి’ మూవీ మేకర్స్. ఈ సినిమాలో సమంతా జర్నలిస్ట్ గా కనిపించనుంది.

మే 9 న రిలీజవుతున్న ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ కంపోజర్. స్వప్న దత్, ప్రియాంక దత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.