తమన్నా ఇంటర్వ్యూ

Monday,December 03,2018 - 02:03 by Z_CLU

అర్బన్ బ్యాక్ డ్రాప్ లో మోస్ట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది ‘నెక్స్ట్ ఏంటి..?’ సినిమా. ఈ నెల 7 న గ్రాండ్ రిలీజవుతుంది. బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లీ ఈ సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన తమన్నా, ‘నెక్స్ట్ ఏంటి’ సినిమాతో టాలీవుడ్ కి కొత్త జోనర్ ఇంట్రడ్యూస్ అవుతుంది అని చెప్తూనే, సినిమా గురించి మరిన్ని విషయాలు చెప్పుకుంది అవి మీకోసం…

తెలుగమ్మాయిని…

నేను పక్కా తెలుగమ్మాయిని… బాలీవుడ్ లో కూడా నన్ను తెలుగమ్మాయిగానే గుర్తిస్తారు… నాకు కూడా అలా అనిపించుకోవడమంటేనే చాలా ఇష్టం…

రెండేళ్ళలో…

గత రెండేళ్లుగా తెలుగు సినిమా చాలా  మారిపోయింది. డిఫెరెంట్ స్టోరీస్ వస్తున్నాయి. ఆడియెన్స్ కూడా డిఫెరెంట్ స్టోరీస్ ని ఎంజాయ్ చేస్తున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఇక్కడి నుండి స్టోరీస్ తీసుకుని రీమేక్ చేస్తున్నారు.

నాకిది ఫస్ట్ సినిమా…

నేను ఇప్పటి వరకు ఇలాంటి సినిమా చేయలేదు. ఒక అమ్మాయి వేసుకునే బట్టల్ని బట్టి ఆమె క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంటారు జనాలు. కానీ అది కాకుండా ఇంకేదో ఉంటుంది. దానికి తోడు పాస్ట్ లో ఉండే పర్సనల్ రిలేషన్ షిప్స్ కూడా అమ్మాయిల ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. ఇదే ఈ సినిమాలో హై పాయింట్.

కథ వినగానే…

చాలా బోల్డ్ సినిమా అనిపించింది. మన రెగ్యులర్ లైఫ్ లో ఉండే చాలా కామన్ పాయింట్స్ నే మనం డిస్కస్ చేయడానికి ఆలోచిస్తుంటాం. అలాంటప్పుడు డెఫ్ఫినెట్ గా ఇది కంపల్సరీగా చేయాల్సిన బోల్డ్ సినిమా అనిపించింది.

ప్రతి డైలాగ్ కి రిలేట్ అయ్యాను…

సినిమాలో నా పేరు ట్యామీ… ఒకరకంగా ఈ క్యారెక్టర్ కి, స్పెషల్ గా డైలాగ్స్ కి నేనైతే చాలా కనెక్ట్ అయ్యాను. చాలా న్యాచురల్ గా అనిపించింది.

నో స్పెషల్ ట్రాక్స్…

సినిమాలో స్పెషల్ గా కామెడీ ట్రాక్స్ లాంటివి ఏవీ ఉండవు. ఇన్ఫాక్ట్ స్టోరీ మొత్తం, నేను, నవదీప్, సందీప్ కిషన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. శరత్ బాబు గారు ఈ సినిమాలో నాకు ఫాదర్ గా నటించారు. ఆయన రోల్ కూడా చాలా బావుంటుంది.

నేను – నా ఫాదర్

సినిమాలో ఫాదర్, డాటర్ కి మధ్య రిలేషన్ షిప్ చాలా ఎలివేట్ అయింది. అర్బన్ బ్యాక్ డ్రాప్ లో ఉండే సినిమా ఇది. ఒక సింగిల్ ఫాదర్, కూతురిని ఎలా పెంచాడు..? ఆ ఇద్దరి మధ్య ఉండే రిలేషన్ షిప్ కి అందరూ కనెక్ట్ అవుతారు.

నాకలా అనిపించింది…

సినిమా చేస్తున్నన్ని రోజులు నాకు అలా కెమెరా ముందు పర్ఫామ్ చేస్తూనే ఉండాలనిపించింది. అంతగా కనెక్ట్ అయిపోయాను. నన్ను, నన్నుగా ప్రెజెంట్ చేసుకునే స్కోప్ నాకీ సినిమా ఇచ్చింది.

నో ట్యాగ్స్…

‘నెక్స్ట్ ఏంటి..?’ సినిమా ట్యాగ్స్ బ్రేక్ చేస్తుందనే అనుకుంటున్నా. ఈ సినిమా కంప్లీట్ గా ఒక ‘అమ్మాయి జర్నీ’ కాబట్టి కంఫర్ట్ కోసం ఫీమేల్ సెంట్రిక్ సినిమా అని ట్యాగ్ పెట్టుకోవచ్చు. కానీ అలాంటి ట్యాగ్స్ ఉండకూడదు అనే నా ఫీలింగ్… నో ట్యాగ్స్ ప్లీజ్…

నవదీప్ రోల్…

నవదీప్ క్యారెక్టర్ సినిమాలో చాలా స్పెషల్. తన ఏజ్ కన్నా పెద్ద రోల్ చేస్తున్నాడు నవదీప్ ఈ సినిమాలో. చాలా హ్యాప్పీగా అనిపిస్తుంది. యాక్టర్స్ ఇప్పుడు ఇలాగే కనిపించాలి, ఇలాంటి రోల్సే చేయాలి అనే బౌండరీస్ ని దాటేస్తున్నారు.

యూనివర్సల్ కాన్సెప్ట్…

‘నెక్స్ట్ ఏంటి..?’ సినిమా యూనివర్సల్ కాన్సెప్ట్. ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళు చూసినా సినిమాకి కనెక్ట్ అవుతారు. హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అని డిఫెరెన్స్ లేదు.. ఎవరైనా సినిమాని ఓన్ చేసుకుంటారు. స్టోరీలైన్ అలాంటిది.

నో బౌండరీస్…

తెలుగు ఆడియెన్స్ నాకీ స్థాయి ఇచ్చినందుకు అదృష్టంగా ఫీల్ అవుతుంటా. ఇక స్టార్ డమ్, స్టార్స్ తోనే స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనే పాయింట్స్ కి నేను పెద్దగా కనెక్ట్ అవ్వను. నా వరకు నేను యాక్టర్ ని… ‘కథ నచ్చాలి’ అదొక్కటే నేను ఆలోచించేది.. తక్కినదేదీ నేను పట్టించుకోను.

నెక్స్ట్ సినిమాలు…

F2 సంక్రాంతికి రిలీజవుతుంది. ‘దటీజ్ మహాలక్ష్మి’ కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజవుతుంది. శ్రీను రామస్వామి డైరెక్షన్ లో తమిళ సినిమా చేస్తున్నాను. ‘సైరా’ లో కూడా నటిస్తున్నాను. ఈ సినిమా డెఫ్ఫినేట్ గా నా కరియర్ స్పెషల్  మూవీ కాబోతుంది.

అదే గ్రేట్ ఫేజ్…

ఇక తమన్నా పని అయిపోయింది. ఇంకేం సినిమాలు చేస్తుంది..? అని ఎవరైనా అన్నప్పుడల్లా ఇంకా కసిగా పని చేయాలనిపిస్తుంది. దాని వల్ల ఇంకా ఎక్కువ పని దొరుకుతుంది. సో నా వరకు నేను టఫ్ ఫేజ్ ని గ్రేట్ ఫేజ్ గానే ట్రీట్ చేస్తాను.

ఓన్లీ షూటింగ్స్..

ఈ సంవత్సరం ఎక్కువ రిలీజెస్ కన్నా, ఎక్కువ షూటింగ్స్ చేశాను. ఈ సినిమాలన్నీ నెక్స్ట్ ఇయర్ రిలీజవుతాయి. ‘KGF’ లో కూడా స్పెషల్ సాంగ్ చేశాను. అది కూడా డిఫెరెంట్ గా ఉంటుంది.