మరో అరుదైన రికార్డు సృష్టించిన చరణ్

Monday,April 16,2018 - 11:53 by Z_CLU

నిన్నటితో 17 రోజుల రన్ పూర్తిచేసుకున్న రంగస్థలం సినిమా మరో అరుదైన రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా 175 కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. తెలుగులో బాహుబలి-2, ఖైదీ నంబర్ 150 తర్వాత 3 వారాల్లోపే 175 కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన చిత్రం రంగస్థలం మాత్రమే. ఈ సినిమాతో సరికొత్త ఇండస్ట్రీ రికార్డు సృష్టించాడు రామ్ చరణ్. తాజా ట్రెండ్స్ ప్రకారం చూస్తుంటే.. రంగస్థలం సినిమా ఊపు మరో వారం రోజులు ఇలానే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో రంగస్థలం హవా కొనసాగుతూనే ఉంది.

 

ఏపీ, నైజాం 17 రోజుల షేర్

నైజాం – రూ. 23.40 కోట్లు

సీడెడ్ – రూ. 15.20 కోట్లు

ఉత్తరాంధ్ర  – రూ. 11.21 కోట్లు

ఈస్ట్ – రూ. 6.69 కోట్లు

వెస్ట్ – రూ. 5.30 కోట్లు

గుంటూరు – రూ. 7.51 కోట్లు

కృష్ణా – రూ. 6.19 కోట్లు

నెల్లూరు – రూ. 2.90 కోట్లు