సైరా - తమన్నా క్యారెక్టర్ వెరీ కాస్ట్ లీ

Thursday,June 13,2019 - 12:03 by Z_CLU

‘సైరా’ లో తమన్నా నటిస్తుందంటే వెరీ స్పెషల్ క్యారెక్టర్ అయి ఉంటుంది అనుకున్నారంతా. కానీ ఈ క్యారెక్టర్ జస్ట్ స్పెషలే కాదు.. కాస్ట్ లీ కూడా… ఈ సినిమాలో తమన్నా కాస్ట్యూమ్ ఎంత ఖరీదంటే, అంత ఖరీదు కాస్ట్యూమ్స్ ఇంతవరకు వేసుకోలేదంట…

‘సైరా’ లో ‘లక్ష్మి’ అనే క్యారెక్టర్ లో కనిపించనుంది తమన్నా. అయితే రీసెంట్ గా ఓ సందర్భంలో మాట్లాడుతూ, తన లైఫ్ లోని మోస్ట్ కాస్ట్ లీ వస్తువుల గురించి మాట్లాడుతూ సైరా గురించి ప్రస్తావించింది. సినిమాలోని ప్రత్యేక సందర్భంలో ఉండబోయే లక్ష్మి క్యారెక్టర్ తనకు చాలా స్పెషల్ అని కూడా చెప్పుకుందీ మిల్కీ బ్యూటీ.

 

బాలీవుడ్ కాస్ట్యూమ్స్ డిజైనర్ అంజు మోడీ, మెగాస్టార్ కూతురు సుష్మిత కలిసి ఈ కాస్టూమ్స్ ని డిజైన్ చేశారు అని చెప్పుకుంది. జస్ట్ గ్రాండియర్ లుక్ కోసం కాదు… క్యారెక్టర్ ని మరింత స్పెషల్ గా ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లో ఫిలిమ్  మేకర్స్ ఈ క్యారెక్టర్ కి ఇంత ప్రిఫరెన్స్ ఇచ్చారని తెలుస్తుంది.

తమన్నా కాస్ట్యూమ్స్ విషయంలోనే ఇంత కేర్ తీసుకున్నారంటే ఈ ‘లక్ష్మి’ సైరా సినిమాలో ఏ స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేయనుందో అర్థమైపోతుంది.