రామ్ చరణ్ కోసం తమన్నా ఫిక్స్

Monday,December 19,2016 - 02:00 by Z_CLU

రామ్ చరణ్ ధృవ థియేటర్స్ లో పెంచిన హీట్ ఇంకా చల్లారనే లేదు అప్పుడే మెగా పవర్ స్టార్ తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఆర్య సినిమా తరవాత రామ్ చరణ్ కోసం స్వయంగా కథను రాసుకున్న సుకుమార్, ఇప్పుడు చెర్రీ కోసం తమన్నాను హీరోయిన్ గా ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నాడని టాక్ వినిపిస్తుంది.

నిన్నా మొన్నటి వరకు ఈ సినిమా కోసం అనుపమ పరమేశ్వరన్ ఆప్షన్స్ లిస్టులో ఉందని రూమర్స్ వచ్చినా, సినిమా యూనిట్ మైండ్ లో మిల్కీ బ్యూటీ ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో సుకుమార్ డైరెక్షన్ లో 100% లవ్ లో నటించిన తమన్నా దట్ ఈజ్ మహాలక్ష్మి అనిపించుకున్న విషయం తెలిసిందే.

రామ్ చరణ్ తో రచ్చ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న తమన్నా, చెర్రీ స్పీడ్ కి పర్ ఫెక్ట్ పార్ట్ నర్ అనిపించుకుంది. మెగా స్పీడ్ తో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్న ఈ రూమర్ గాని నిజమైతే, సుకుమార్ డైరెక్షన్ లో మరో 100% హిట్ పడ్డట్టే.