అరవింద్ స్వామి షాకింగ్ స్టేట్ మెంట్
Monday,December 19,2016 - 01:00 by Z_CLU
రామ్ చరణ్ నటించిన ధృవ ప్రెజెంట్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాతో చాలా ఏళ్ల తర్వాత తెలుగు ఆడియన్స్ ముందుకొచ్చిన అరవింద్ స్వామి తన స్టైలిష్ లుక్ యాక్టింగ్ తో మెయిన్ హైలైట్ గా నిలిచి సక్సెస్ లో ముఖ్య భాగం అయ్యారు.
ఈ సినిమా తో ఈ హ్యాండ్ సం హీరో ఇక పై తెలుగు లోనూ స్టైలిష్ విలన్ గా ఎంటర్టైన్ చేస్తాడనుకుంన్నారంతా. అయితే అలాంటిదేమి లేదని ఇకపై తెలుగు సినిమాలు చేయనని అనౌన్స్ చేశాడు అరవింద్ స్వామి. ఈ విషయంపై లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇకపై తెలుగులో సినిమాలు చేయనని. లాంగ్వేజ్ రాకుండా ఓ క్యారెక్టర్ కి న్యాయం చేయలేనని ప్రకటించాడు. తని ఒరువన్ లో చేసిన క్యారెక్టర్ కాబట్టే ధృవలో నటించానని ప్రెజెంట్ తమిళ్ లో నటుడిగా చేస్తున్న సినిమాలు ఫినిష్ అవ్వగానే ఓ సినిమా డైరెక్ట్ చేస్తానని.. ఆ సినిమాకు కథ కూడా రాస్తున్నానని చెప్పుకొచ్చాడు అరవింద్ స్వామి.