మరో 4 రోజుల్లో రంగస్థలం పూర్తి

Wednesday,February 28,2018 - 05:03 by Z_CLU

రంగస్థలం సినిమాకు సంబంధించి మరో 4 రోజుల్లో టోటల్ షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు నుంచి చరణ్ మళ్లీ సెట్స్ పైకి వచ్చాడు. ఉదయం సారథి స్టుడియోస్ లో చెర్రీపై కొన్ని షాట్స్ తీశారు. మధ్యాహ్నం నుంచి  బూత్ బంగ్లాలో షూటింగ్ జరిగింది.

రేపు, ఎల్లుండి సినిమా షూటింగ్ ఉండదు. మళ్లీ 3వ తేదీ నుంచి షెడ్యూల్ మొదలవుతుంది. అక్కడ్నుంచి మరో 2 రోజులు షూటింగ్ చేస్తే రంగస్థలం టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఇదంతా కంప్లీట్ ప్యాచ్ వర్క్ మాత్రమే. సాంగ్స్ షూటింగ్ తో పాటు కీలక సన్నివేశాలన్నీ ఎప్పుడో అయిపోయాయి.

మరోవైపు షూటింగ్ తో పాటు సైమల్టేనియస్ గా ప్రమోషన్ కూడా నడుస్తోంది. ఈ వారంలోనే సెకెండ్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నారు. మార్చి 18న విశాఖలో గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేసి, 30వ తేదీన సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనేది ప్లాన్. సుకుమార్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో చెర్రీ సరసన సమంత హీరోయిన్ గా నటించింది. పూజా హెగ్డే ఐటెంసాంగ్ చేసింది.