పవర్ స్టార్ కి సిస్టర్ ఫిక్సయింది

Monday,December 19,2016 - 03:30 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సిస్టర్ ఫిక్సయింది. ప్రస్తుతం కాటమరాయుడు సినిమాతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, ఈ సినిమాకు ప్యాకప్ చెప్తాడో లేదో, త్రివిక్రమ్ సినిమాతో సెట్స్ పైకి వచ్చేస్తాడు. అయితే ఫిక్సయిన ఈ సిస్టర్ త్రివిక్రమ్ సినిమాకి కాదు R.T. నేసన్ సినిమాకి.

తమిళ బ్లాక్ బస్టర్ ‘వేదళం’ సినిమా రీమేక్ వర్షన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, టైం దొరికినప్పుడల్లా త్రివిక్రమ్ సినిమాతో పాటు, ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ లో ను ఆక్టివ్ గా అటెండ్ అవుతున్నాడు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి చెల్లెలి క్యారెక్టర్ ని నివేద థామస్ ని ఫిక్సయ్యారు ఫిలిం మేకర్స్.

జెంటిల్ మెన్ సినిమాతో ట్యాలెంటెడ్ నటి అనిపించుకున్న నివేద థామస్, ఇంత షార్ట్ టైం లో పవర్ స్టార్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ కి సెలెక్ట్ అవ్వడం టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ లా మారింది.