గుమ్మడికాయ కొట్టిన సైరా

Tuesday,June 25,2019 - 11:34 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా సినిమాకు సంబంధించి బిగ్ అప్ డేట్ ఇది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్ పూర్తిచేసుకుంది. నిన్న జరిగిన ప్యాచ్ వర్క్ తో ఈ సినిమా టోటల్ షూట్ పూర్తయింది. అలా సైరా షూట్ కు గుమ్మడికాయ కొట్టేశారు.

సైరా షూటింగ్ పూర్తవ్వడంతో ఇకపై టోటల్ యూనిట్ అంతా పోస్ట్-ప్రొడక్షన్ పై దృష్టిపెట్టనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చిరంజీవి డబ్బింగ్ స్టార్ట్ చేశారు. మరో రెండు రోజుల్లో ఆ డబ్బింగ్ ఫార్మాలిటీస్ కూడా పూర్తయిపోతాయి. కీలకమైన గ్రాఫిక్స్ తో పాటు డీఐ వర్క్ కు కాస్త ఎక్కువ సమయం పట్టేలా ఉంది.

నయనతార, తమన్న హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయబోతున్నారు. ఆగస్ట్ 22న ఈ సినిమాకు సంబంధించి టీజర్ వీడియో రిలీజ్ చేయబోతున్నారు.