సైరాలో మరో స్టార్ హీరోయిన్?

Wednesday,April 11,2018 - 12:37 by Z_CLU

సైరాలో నయనతార హీరోయిన్. చిరు, నయన్ కాంబోలో ఇప్పటికే షూటింగ్ కూడా నడుస్తోంది. ఇప్పుడీ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ కూడా చేరబోతోందంటూ వార్తలొస్తున్నాయి. ఆమె మరెవరో కాదు, మిల్కీబ్యూటీ తమన్న. అవును.. సైరాలో తమన్న కూడా చేరే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది.

బాహుబ‌లి లో అవంతికగా న‌టించిన త‌ర్వాత సెల‌క్టివ్‌గా వెళ్తోంది తమన్న. ఇందులో భాగంగానే ఈమె ఇప్పుడు మెగా ప్రాజెక్ట్ `సైరా న‌ర‌సింహా రెడ్డి`లో న‌టించ‌బోతుంద‌ట. దాదాపు బాహుబలిలో చేసిన అవంతిక పాత్ర తరహాలోనే వీరోచితంగా ఉంటుందట సైరాలో తమన్న పాత్ర.

సురేందర్ రెడ్డి డైరక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తమన్న ఎలిమెంట్ తో పాటు మరెన్నో అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ గాసిప్స్ అన్నింటిపై యూనిట్ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి