షూటింగ్ అప్ డేట్స్

Tuesday,April 02,2019 - 04:11 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు షూటింగ్ ఫినిష్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం…

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహ రెడ్డి’ షూటింగ్ కి సంబంధించి స్మాల్ బ్రేక్ తీసుకున్నారు యూనిట్. ఏప్రిల్ 9 నుండి మరో షెడ్యుల్ స్టార్ట్ కానుంది. హైదరాబాద్ శివార్లలో వేసిన భారీ సెట్ లో నెక్స్ట్ షెడ్యుల్ జరగనుంది. నయనతార, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ప్రభాస్ -రాధా కృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి రెండో షెడ్యుల్ పూర్తయింది. యూరప్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా మూడో షెడ్యుల్ త్వరలోనే స్టార్ట్ కానుంది. నెక్స్ట్ షెడ్యుల్ కోసం హైదరాబాద్ లో ఏకంగా 18 సెట్స్ వేయబోతున్నారట. ప్రతిసారి యూరప్ వెళ్లడం కుదరదు. మరీ ముఖ్యంగా 1970ల నాటి పరిస్థితులు ఎక్కడా కనిపించవు. అందుకే ఈ సినిమా కోసం భారీ సెట్స్ వేయబోతున్నారని తెలుస్తోంది.

ఇటివలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ‘మన్మధుడు 2’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం అన్నపూర్ణ ఏడెకరాల్లో ఆర్ట్ డైరెక్టర్స్ రామ కృష్ణ -మోనికా వేసిన ఫారెన్ సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. రాహుల్ డైరెక్షన్ లో అన్నపూర్ణ స్టూడియోస్ , అనంది ఆర్ట్స్ బ్యానర్ పై ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఇటివలే మొదటి షెడ్యుల్ పూర్తి చేసుకున్న నాని ‘గ్యాంగ్ లీడర్’ రెండో షెడ్యుల్ కి రెడీ అవుతోంది. ఏప్రిల్ 7 నుండి ఈ సినిమాకు సంబంధించిన రెండో షెడ్యుల్ మొదలు కానుంది. హైదరాబాద్ లో ఈ షెడ్యుల్ జరగనుంది. ఈ షెడ్యుల్ నాని అలాగే మిగతా నటీ నటులపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై విక్రం కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ కంపోజర్.

బెల్లం కొండ శ్రీనివాస్ – కాజల్ జంటగా నటిస్తున్న’సీత’ సినిమా ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ ఫినిష్ చేసుకుంది. మిగిలిన ప్యాచ్ వర్క్ ను ఏప్రిల్ రెండో వారానికల్లా పూర్తి చేసే పనిలో ఉన్నారు. తేజ డైరెక్షన్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25 న థియేటర్స్ లోకి రానుంది.

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. ఈ నెల 22 నుండి సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. కాకినాడ బీచ్ లో మొదటి షెడ్యుల్ జరగనుంది. దాదాపు ఓ పది రోజుల పాటు ఈ షెడ్యుల్ జరగనుందని సమాచారం. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

గిరి డైరెక్షన్ లో అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజికి చేరుకుంది. సినిమాకు సంబందించిన ఫైనల్ షెడ్యుల్ ఈ నెల 15 నుండి జరగనుంది. అంతర్వేది , సఖినేటి పల్లి ప్రాంతాల్లో జరగున్న ఈ షెడ్యుల్ లో అల్లరి నరేష్ , పృథ్వి, పోసాని లపై కొన్నికామెడీ సన్నివేశాలను చిత్రీకరించనుండి యూనిట్. ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా మే నెలాఖరులో విడుదల కానుందని సమాచారం.