ఈసారైనా సిక్స్ ప్యాక్ చూపిస్తాడా?

Tuesday,June 25,2019 - 11:03 by Z_CLU

25 సినిమాలు కంప్లీట్ చేశాడు కానీ ఇప్పటి వరకు సిక్స్ ప్యాక్స్ లో కనిపించలేదు మహేష్ బాబు. సినిమా సెట్స్ పైకి రావడానికి ఉన్న చిన్న గ్యాప్ లో చిన్నగా ఫిట్ నెస్ ట్రైనింగ్ స్టార్ట్ చేసినా, ఈసారి మహేష్ బాబు సిక్స్ ప్యాక్స్ లుక్స్ గ్యారంటీ అని ఫిక్సయిపోతున్నారు ఫ్యాన్స్. మరి ఈసారైనా సూపర్ స్టార్ సిక్స్ ప్యాక్స్ లో కనిపిస్తాడా..?

 

గతంలో వన్ – నేనొక్కడినే సినిమా టైమ్ లో కూడా అమెరికన్ జిమ్ కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు మహేష్ బాబు. అలా స్పెషల్ ట్రైనింగ్ తీసుకునే సరికి అప్పుడు కూడా సిక్స్ ప్యాక్ కోసమే ఇదంతా చేస్తున్నాడనుకున్నారంతా.. చివరకి అది జస్ట్ ఫిట్ నెస్ కోసమే తీసుకున్న ట్రైనింగ్ అని తేలిపోయింది.

ఇక ఇప్పుడు ఏకంగా ఇటాలియన్ ట్రైనర్ దగ్గర  ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. మరి ఈసారి కూడా జస్ట్ ఫిట్ నెస్ కోసమేనా.? లేకపోతే ఫ్యాన్స్ లో ఈ రేంజ్ లో సిక్స్ ప్యాక్స్ డిమాండ్ ఉంది కాబట్టి ఓ సారి ట్రై చేద్దామని సూపర్ స్టార్ ఫిక్సయి ఉంటాడా…?

అనిల్ రావిపూడి సినిమాలో ఆర్మీ మేజర్ గా కనిపించబోతున్నాడు మహేష్ బాబు. మిలిటరీ ఆఫీసర్ గా కనిపించాలి కాబట్టి కొద్దో గొప్పో వర్కవుట్ చేయనిదే సెట్స్ పైకి రాడు మహేష్ బాబు. అందుకే ఈ స్పెషల్ ట్రైనింగ్ అయి ఉంటుంది అని కొన్ని చోట్ల టాక్.. మరికొన్ని చోట్ల ఈ సారి మహేష్ బాబు సిక్స్ ప్యాక్స్ చూపించడం గ్యారంటీ అని గట్టిగానే  వినిపిస్తుంది. ఈ రెండింటిలో ఏది పక్కా అనేది ఇంకొన్ని రోజులు ఆగితే కానీ తెలీదు.