షూటింగ్ అప్డేట్స్

Wednesday,September 19,2018 - 10:10 by Z_CLU

సైరా’

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘సైరా నరసింహ రెడ్డి’ షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేయనుంది యూనిట్. ఈ వార్ ఎపిసోడ్ ను గ్రెగ్ పావెల్ నేతృత్వంలో గ్రాండియర్ గా తెరకెక్కిస్తున్నారు. దాదాపు 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుందని సమాచారం. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు.

మహర్షి

సూపర్ స్టార్ మహేష్ లేటెస్ట్ మూవీ ‘మహర్షి’ షూటింగ్ కి సంబందించి ప్రస్తుతం చిన్న బ్రేక్ ఇచ్చారు.. 23 నుండి హైదరాబాద్లో మరో షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ లో మహేష్, పూజా హెగ్డే, అల్లరి నరేష్ లతో పాటు మిగతా నటీ నటులపై కొన్ని కీలక సీన్స్ షూట్ చేయనున్నారు యూనిట్. అశ్వనిదత్, దిల్ రాజు, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.


అరవింద సమేత

యంగ్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత ఇటివలే హైదరాబాద్ లో ఓ భారీ షెడ్యూల్ ఫినిష్ చేసుకుంది.. ఈ నెల 23 న యూరప్ బయలదేరనుంది యూనిట్. ఇటలీ లో మూడు రోజుల పాటు తారక్ -పూజా హెగ్డే లపై ఓ సాంగ్ ను షూట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ తో టోటల్ షూటింగ్ కి ప్యాక్ అప్ చెప్పనున్నారు. హారికా & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై రాదా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ లో దసరా కానుకగా థియేటర్స్ లోకి రానుంది.

రామ్ చరణ్ బోయపాటి

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రామ్‌చరణ్‌ నటిస్తున్న మూవీ షూటింగ్ ప్రస్తుతం అజర్భైజన్ లో శరవేగంగా జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ లో చరణ్ , వివేక్ ఒబెరాయ్ లపై కొన్ని యాక్షన్ పార్ట్ షూట్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు. జనవరిలో సంక్రాంతి కానుకగా సినిమా థియేటర్స్ లోకి రానుంది.


‘సవ్యసాచి’

యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘సవ్యసాచి’ ఫైనల్ షెడ్యూల్ జరుపుకుంటుంది.. ఇటివలే మొదలైన ఈ షెడ్యూల్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది.. ప్రస్తుతం ఓ కాలేజిలో నాగ చైతన్య పై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఈ నెల 23 నుండి ఈ సినిమాకు సంబంధించి బ్యాలెన్స్ సాంగ్ ను హైదరాబాద్ లో సెట్ వేసి షూట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ తో టోటల్ షూటింగ్ కి ప్యాక్ అప్ చెప్పనుంది యూనిట్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతూ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

యాత్ర

మమ్ముట్టీ మెయిన్ రోల్ లో నటిస్తున్న ‘యాత్ర’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్, బేగంపేట్ లో ఓ ఇంట్లో జరుగుతుంది.. మమ్ముట్టీ తో పాటు కొందరు నటీ నటులు ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. త్వరలోనే పాద యాత్రకి సంబంధించిన సీన్స్ షూట్ చేయబోతున్నారు. ’70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై విజయ్, శశి నిర్మిస్తున్న ఈ సినిమాకు మహి వి రాఘవ్ డైరెక్టర్. డిసెంబర్ 21 న గ్రాండ్ గా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

పడి పడి లెచే మనసు

నేపాల్ లో ఒక షెడ్యూల్ ఫినిష్ చేసుకున్న శర్వానంద్ ‘పడి పడి లెచే మనసు’ ప్రస్తుతం హైదరాబాద్ లో ఫైనల్ షెడ్యూల్ జరుపుకుంటుంది. 15 రోజుల పాటు వరకూ జరగనున్న ఈ షెడ్యూల్ తో టాకీ పార్ట్ ఫినిష్ కానుంది.. ఆ తర్వాత బ్యాలెన్స్ రెండు పాటలను షూట్ చేయనున్నారు. హను రాఘవ పూడి డైరెక్షన్ లో యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. డిసెంబర్ 21న సినిమాను థియేటర్స్ లోకి రానుంది.

మిస్టర్ మజ్ను

అఖిల్- వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘మిస్టర్ మజ్ను’ సినిమా ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో అఖిల్, నిధి లపై కొన్ని కీలక సీన్స్ షూట్ చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై భోగవల్లి బాపినీడు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.