సాయి పల్లవికి సిసలైన పరీక్ష

Tuesday,June 25,2019 - 12:03 by Z_CLU

ఓ సినిమాలో సాయి పల్లవి ఫిక్సయిందంటే అనుమానం లేదు.. ఎలాంటి క్యారెక్టర్ అయినా పండించేస్తుందనే ఇమేజ్ ఉంది ఫ్యాన్స్ లో… అదొకటేనా సాయి పల్లవి స్టెప్పులేసిందంటే చూస్తూ కూర్చోవాల్సిందే… అనే అభిప్రాయం కూడా ఉంది. అటు నటిగా.. ఇటు డ్యాన్సర్ గా ఇప్పటివరకు 100% ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయింది సాయిపల్లవి.. అయితే అసలు పరీక్ష ఇప్పుడు బిగిన్ కానుంది.

విరాట పర్వం.. సినిమాలో సాయిపల్లవిడే కీలక పాత్ర. అందునా 1980 బ్యాక్ డ్రాప్… సాయిపల్లవి రెగ్యులర్ లుక్ లో కాకుండా డీ గ్లామరైజ్ క్యారెక్టర్ లో నటించబోతుంది ఈ సినిమాలో. ఓ రకంగా చెప్పాలంటే ఏ స్థాయి నటి అయినా ఇది చాలెంజింగ్ రోలే… అలాంటిది ఈ క్యారెక్టర్ సాయి పల్లవికి వరించింది.

మరిపక్క శేఖర్ కమ్ముల… ఈ దర్శకుడితో పనిచేయడం సాయి పల్లవికి కొత్త కాకపోయినా, సినిమాలో కనిపించబోయేది డ్యాన్సర్ క్యారెక్టర్ లో.. కాబట్టి సాయి పల్లవి ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో వేసిన స్టెప్పులు వేరు.. ఇప్పుడు ఈ సినిమాలో ఫుల్ టైమ్ డ్యాన్సర్ గా నటించడం వేరు…

సాయిపల్లవికి ఇది సిసలైన పరీక్ష అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నా సాయిపల్లవి మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అందునా వచ్చిన అవకాశాల్లోంచి ఏరి కోరి మరీ ఈ సినిమాలను ఎంచుకుంది. వరస చూస్తుంటే సాయిపలవి ఈ పరీక్షలో కూడా ఈజీగా నెగ్గుతుందనే  అనిపిస్తుంది.