కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసిన నరసింహారెడ్డి

Monday,December 10,2018 - 06:24 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా సినిమాకు సంబంధించి మరో భారీ షెడ్యూల్ మొదలైంది. రేపట్నుంచి మైసూర్ లోని కొన్ని రాచకోటల్లో ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు తీయబోతున్నారు. ఇందులో పాల్గొనేందుకు చిరంజీవి ఇప్పటికే మైసూర్ చేరుకున్నారు.

సినిమా మొత్తం ప్రీ-ఇండిపెండెన్స్ నేపధ్యంలో తెరకెక్కుతుంది కాబట్టి మైసూర్ లో ఉన్న రాజప్రసాదాలు, చారిత్రక కట్టడాలు ఈ సినిమాకు బాగా పనికొస్తాయి. అందుకే యూనిట్ మైసూర్ కు షిఫ్ట్ అయింది. మైసూర్ కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ జలపాతం వద్ద కూడా కొన్ని సన్నివేశాలు ప్లాన్ చేశారు.

కొణిదెల ప్రొడక్షన్స్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, చిరంజీవి మధ్య సీన్స్ బాగుంటాయని ఫిలిం నగర్ టాక్. అలాగే ఈ సినిమాలో తమిళ్ హీరో విజయ్ సేతుపతి తో పాటు కన్నడ హీరో సుదీప్ కూడా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రానుంది సైరా.