కంటెంట్ కు తగ్గ లొకేషన్.. సైరా ప్రీ-రిలీజ్ ఫంక్షన్

Thursday,September 05,2019 - 04:02 by Z_CLU

తొలి స్వాతంత్ర్య సమరయోధుడి పోరాటాన్ని వెండితెరపైకి తీసుకొస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. రేనాడు ప్రాంతంలో స్వతంత్ర ఉద్యమాన్ని ప్రారంభించిన నరసింహారెడ్డి జీవిత గాధ ఇది. ప్రస్తుతం ఈ ప్రాంతం కర్నూలు జిల్లా కిందకు వస్తుంది. అందుకే సైరా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు కర్నూల్ ను వేదికగా ఫిక్స్ చేశారు మెగాస్టార్.

సెప్టెంబర్ రెండో వారంలో ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు. అయితే డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు. ఎందుకంటే, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్స్ ను ఈ ఫంక్షన్ కు ఆహ్వానిస్తున్నారు. వాళ్లందరి డేట్స్ కలిసొచ్చేలా తేదీని ఫిక్స్ చేస్తారు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఇది కూడా మరో 2 వారాల్లో కంప్లీట్ అయిపోతుంది. ఈనెలాఖరుకు సినిమా ఫస్ట్ కాపీ రెడీ అవ్వడంతో పాటు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేయబోతున్నారు. సినిమాను వరల్డ్ వైడ్ భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు.