జీ సినిమాలు ( 6th సెప్టెంబర్ )

Thursday,September 05,2019 - 10:02 by Z_CLU

అఖిల్

నటీనటులు : అఖిల్ అక్కినేనిసాయేషా సైగల్

ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్బ్రహ్మానందంసప్తగిరిహేమమహేష్ మంజ్రేకర్వెన్నెల కిషోర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్, S.S. తమన్

డైరెక్టర్ : V.V.వినాయక్

ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డినితిన్

రిలీజ్ డేట్ : నవంబర్ 11, 2015

అక్కినేని అఖిల్ డెబ్యూ ఫిల్మ్ అఖిల్. సాయేషా హీరోయిన్ గా నటించింది. పక్కా రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమారిలీజైన అన్ని థియేటర్ లలోను  సూపర్ హిట్టయింది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని వి.వి. వినాయక్ దర్శకత్వం వహించాడు. అఖిల్ ఆఫ్రికాలో జాగ్వార్ తో చేసే ఫైట్ హైలెట్ గా నిలుస్తుంది.

=============================================================================

చింతకాయల రవి
నటీనటులు : వెంకటేష్అనుష్క శెట్టి
ఇతర నటీనటులు : మమత మోహన్ దాస్వేణు తొట్టెంపూడిశయాజీ షిండేచంద్ర మోహన్బ్రహ్మానందంసునీల్ఆలీ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ – శేఖర్
డైరెక్టర్ : యోగి
ప్రొడ్యూసర్ నల్లమలుపు బుజ్జి
రిలీజ్ డేట్ : 2 అక్టోబర్ 2008
చింతకాయల రవి USA లో ఒక బార్ లో పని చేస్తుంటాడు. ఇండియాలో ఉండే తన తల్లికి మాత్రం అమెరికాలో పెద్ద సాఫ్ట్ ఇంజినీర్ అని చెప్పుకుంటాడు. ఈ లోపు రవి మదర్రవికి పెళ్ళి చేద్దామనుకునే ప్రాసెస్ లో సంబంధం చూసి ఫిక్స్ చేస్తుంది. అటు వైపు పెళ్ళి కూతురు ఫ్యామిలీ రవి ఎలాంటి వాడో తెలుసుకోవాలనే ఉద్దేశంతో సునీతను ఎంక్వైరీ చేయమని చెప్తారు. ఆ తరవాత ఏం జరుగుతుంది…? రవి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కాదని తెలుసుకున్న సునీత ఏం చేస్తుంది..ఆ తరవాత కథ ఏ మలుపు తిరుగుతుంది అనేది జీ సినిమాలు లో చూడాల్సిందే.

==============================================================================

కొంచెం ఇష్టం కొంచెం కష్టం

నటీనటులు : సిద్ధార్థతమన్నా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్రమ్యకృష్ణబ్రహ్మానందంనాజర్వేణు మాధవ్సుధ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శంకర్ఎహసాన్లాయ్

డైరెక్టర్ కిషోర్ కుమార్ పార్ధసాని

ప్రొడ్యూసర్ నల్లమలుపు శ్రీనివాస్

రిలీజ్ డేట్ : 5 ఫిబ్రవరి 2009

పై చదువుల కోసమని సిటీకి వచ్చిన గీతఅక్కడే ఉండే సిద్ధు ప్రేమించుకుంటారు. ఎప్పుడైతే సిద్ధూ తమ ప్రేమ గురించి గీత ఫాదర్ కి చెప్తాడోఅప్పుడు సిద్ధూ తల్లిదండ్రులు కలిసి ఉండటం లేదు అనే ఒకే కారణంతోఈ పెళ్లి జరగదని తేల్చి చెప్పేస్తాడు. అసలు సిద్ధూ తల్లిదండ్రులు విడిపోవడానికి కారణం ఏంటి..తన ప్రేమను దక్కించుకోవడానికి సిద్ధూ ఏం చేస్తాడు అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

 

కథానాయకుడు

నటీనటులు రజినీ కాంత్జగపతి బాబుమీనానయన తార

ఇతర నటీనటులు : మమత మోహన్ దాస్ప్రభువిజయ్ కుమార్బ్రహ్మానందంఆలీసునీల్, M.S.నారాయణ

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : P.వాసు

ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్

రిలీజ్ డేట్ : 1 ఆగష్టు 2008

ఒక ఇమోషనల్ కథాంశంతో తెరకెక్కిందే కథానాయకుడు సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఫ్రెండ్ గా నటించాడు జగపతి బాబు ఈ సినిమాలో. ఒక పెద్ద స్టార్ కిఒక మధ్య తరగతి సాధారణ వ్యక్తికి మధ్య ఉండే స్నేహానికి ప్రతిబింబమే ఈ కథా నాయకుడు. ఈ సినిమాకి P. వాసు డైరెక్టర్.

==============================================================================

శ్రీమంతుడు
నటీనటులు : మహేష్ బాబుశృతి హాసన్
ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్జగపతి బాబుసుకన్యసితారముకేష్ రిషిసంపత్ రాజ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : కొరటాల శివ
ప్రొడ్యూసర్ : Y. నవీన్, Y. రవి శంకర్, C.V. మోహన్
రిలీజ్ డేట్ : 7 ఆగష్టు 2015

కొరటాల మార్క్ కమర్షియల్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ‘శ్రీమంతుడు’. రూరల్ డెవెలప్ మెంట్ కోర్స్ నేర్చుకునే ప్రాసెస్ లో చారుశీలకు దగ్గరైన హర్షఒక రిమోట్ విలేజ్ ని దత్తత తీసుకుంటాడు. ఆ ఊరిని డెవెలప్ చేసే ప్రాసెస్ లో ఉన్న అడ్డంకులను ఫేస్ చేస్తూనేఎలాగైనా ఆ ఊరికి అండగా నిలవలనుకునే హర్షకితన తండ్రిది కూడా అదే ఊరని తెలుసుకుంటాడు. ఆ తరవాత ఏం జరిగింది..తన తండ్రిని మళ్ళీ ఆ ఊరికి ఎలా దగ్గర చేశాడు..అనేదే సినిమా ప్రధాన కథాంశం.

=============================================================================

కళ్యాణ వైభోగమే

నటీనటులు : నాగశౌర్యమాళవిక నాయర్

ఇతర నటీనటులు : రాశిఆనంద్ప్రగతినవీన్ నేనిఐశ్వర్యతాగుబోతు రమేష్ మరియుతదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ కోడూరి

డైరెక్టర్ : B.V. నందిని రెడ్డి

ప్రొడ్యూసర్ : K.L. దామోదర్ ప్రసాద్

రిలీజ్ డేట్ : 4 మార్చి 2016

నందిని రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన హిల్లేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కళ్యాణ వైభోగమే. కేవలం పెద్దల బలవంతం పై పెళ్లి చేసుకున్న ఒక యువజంట పెళ్లి తరవాత ఏం చేశారు..అనేదే  సినిమా ప్రధానాంశం. యూత్ ఫుల్ కామెడీ  సినిమాలో పెద్ద హైలెట్.