హాలీవుడ్ ని టాలీవుడ్ కి రప్పించిన సినిమాలు

Friday,November 22,2019 - 12:45 by Z_CLU

ఓ గొప్ప సినిమా చేస్తే ‘హాలీవుడ్ స్థాయి’ అని కంపేర్ చేస్తుంటారు. కానీ ఈ ప్యాటర్న్ దాటి ఈ మధ్య కొన్ని సినిమాలు ఏకంగా హాలీవుడ్ నే టాలీవుడ్ కి రప్పించాయి. అలాగని ఏదో కొత్తదనం కోసమో…. ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం ఈ పాత్రల్ని సృష్టించలేదు… కథలు డిమాండ్ చేశాయంతే… 

RRR : అల్లూరి సీతారామరాజు.. కొమురం భీమ్.. కథ ఈ రియల్ హీరోస్ చుట్టూ తిరిగినప్పుడు బ్యాక్ డ్రాప్ బ్రిటీష్ కాకుండా ఇంకేముంటుంది. అందుకే ఈ వింటేజ్  స్టోరీ కోసం హాలీవుడ్ దిగొచ్చింది…. NTR హీరోయిన్ గా ఒలీవియా… విలన్స్  గా రే స్టీవెన్ సన్, ఆలిసన్ డూడీ నటిస్తున్నారు.

నిశ్శబ్దం : అనుష్క లీడ్ రోల్ ప్లే చేస్తున్న సినిమా. కథ U.S. బ్యాక్ డ్రాప్ లో కాబట్టి లొకేషన్స్ మాత్రమే కాదు.. సినిమాలోని మరో కీ రోల్ లో హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్ సన్ నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమా చుట్టూ  ఇంటర్నేషనల్ స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది.

సైరా : సినిమా బ్రిటీష్ కాలం నాటిది. కథ అప్పటి స్వాతంత్ర యోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’. బ్రిటీష్ వాళ్ళు కాకుండా విలన్స్ ఇంకెవరుంటారు… హాలీవుడ్ నటుడు ‘ఆలెక్స్ ఓనీల్’ ఈ సినిమాలో విలన్ గా కనిపించాడు. సైరా కన్నా ముందు కొన్ని బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాడు ఆలెక్స్.