స్టార్ హీరోలు – రిపీటెడ్ బ్యానర్లు

Saturday,September 21,2019 - 10:03 by Z_CLU

ఓ హిట్టు పడితే ఆ డైరెక్టర్ తో ఇమ్మీడియట్ గా హీరోలు ఇంకో సినిమా చేయడం కామనే. కానీ ఓ సినిమా సెట్స్ పై ఉండగానే అదే బ్యానర్ లో ఇంకో సినిమాని కూడా ఫిక్సవుతున్నారు స్టార్ హీరోలు.

నితిన్ : ప్రస్తుతం సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో ‘భీష్మ’ చేస్తున్నాడు నితిన్. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే వెంకీ అట్లూరి తో ‘రంగ్ దే’  సినిమా ఫిక్సయ్యాడు. ఆ సినిమా కూడా ఈ బ్యానర్ లోనే.

ప్రభాస్ : ‘బాహుబలి’ లాంటి గ్రాండ్ సక్సెస్ తరవాత ఇమ్మీడియట్  సినిమా సుజిత్ డైరెక్షన్ లో UV క్రియేషన్స్ బ్యానర్ పై చేసిన ప్రభాస్, తన నెక్స్ట్ సినిమా ‘జాన్’ చేయబోయేది కూడా ఈ బ్యానర్ లోనే.

చిరంజీవి : మెగాస్టార్ చిరజీవి ‘సైరా’ తెరకెక్కేది ‘కొణిదెల ప్రొడక్షన్స్’ బ్యానర్ లోనే. ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా కొరటాల  డైరెక్షన్ లో సెట్స్ పైకి రాబోయే సినిమా కూడా ఈ బ్యానర్ లోనే.