జార్జియా షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న 'సైరా' టీమ్
Thursday,October 18,2018 - 12:06 by Z_CLU
పక్కా ప్లానింగ్ తో షూటింగ్ జరుపుకుంటుంది మెగాస్టార్ ‘సైరా’ టీమ్. జార్జియాలో సినిమాలోని భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్న మేకర్స్, ఈ షెడ్యూల్ కి సక్సెస్ ఫుల్ గా ప్యాకప్ చెప్పేశారు. 500 మంది పాల్గొన్న ఈ షెడ్యూల్ లో కిచ్చా సుదీప్ తో పాటు విజయ్ సేతుపతి కూడా పాల్గొన్నారు.
జార్జియా నుండి వచ్చీ రాగానే ఇమ్మీడియట్ గా RFC లో నెక్స్ట్ షెడ్యూల్ బిగిన్ చేస్తుంది సినిమా యూనిట్. ఈ షెడ్యూల్ కోసం RFC లో ఇప్పటికే భారీ సెట్ నిర్మించే పనిలో ఉంది సైరా టీమ్. డిసెంబర్ వరకు జరగనున్న ఈ భారీ షెడ్యూల్ తో దాదాపు 90% ‘సైరా’ తెరకెక్కినట్టే అని తెలుస్తుంది.
నయనతార ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నటిస్తుంది. అమిత్ త్రివేది మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి డైరెక్టర్. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.