చైతూకు పదేళ్లు.. నానికి 11 ఏళ్లు

Thursday,September 05,2019 - 03:21 by Z_CLU

ఈ రోజు ఇద్దరు స్టార్ హీరోలు తమ కెరీర్ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారు. అవును.. నాని, చైతూ ఇద్దరికీ ఈ రోజు చాలా స్పెషల్. నాని ఇవాళ్టితో 11 ఏళ్ల కెరీర్ పూర్తిచేసుకుంటే.. అటు నాగచైతన్య ఈరోజుతో పదేళ్ల కెరీర్ పూర్తిచేసుకున్నాడు.

ముందుగా నాగచైతన్య విషయానికొద్దాం. 2009లో సరిగ్గా ఇదే రోజు (సెప్టెంబర్ 5) చైతూ హీరోగా మారాడు. అతడు నటించిన జోష్ సినిమా విడుదలైంది. ఆ మూవీ నుంచి ఇప్పటివరకు స్టెప్ బై స్టెప్ తన ఇమేజ్ తో పాటు మార్కెట్ ను పెంచుకుంటూ వస్తున్నాడు నాగచైతన్య. ఈ దశాబ్ద కాలంలో మెమొరబుల్ హిట్స్ తో, ప్రస్తుతం టాలీవుడ్ లీడింగ్ హీరోస్ లో ఒకడిగా నిలిచాడు.

ఇక నాని కూడా ఇవాళ్టితో 11 ఏళ్ల కెరీర్ పూర్తిచేసుకున్నాడు. అతడు నటించిన అష్టాచమ్మా విడుదలై నేటికి సరిగ్గా 11 ఏళ్లు అవుతుంది. ఈ 11 ఏళ్లలో మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకోవడంతో పాటు నేచురల్ స్టార్ గా ఎదిగాడు నాని. ఈ 11 ఏళ్లలో జెట్ స్పీడ్ తో సినిమాలు చేస్తూ, ఏకంగా 25వ సినిమా మైలురాయికి చేరుకున్నాడు. అంతేకాదు.. నిర్మాతగా కూడా మారాడు.