టాక్సీవాలాకు విశెష్ చెప్పిన విలక్షణ నటుడు

Wednesday,November 14,2018 - 12:27 by Z_CLU

అర్జున్ రెడ్డిలో తన నటనతో ఎంతోమంది స్టార్స్ ను మెస్మరైజ్ చేశాడు విజయ్ దేవరకొండ. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి అంతటివాడే, దేవరకొండను స్వయంగా స్టార్ క్లబ్ లోకి ఆహ్వానించాడు. ఆ లిస్ట్ లో కోలీవుడ్ విలక్షణ నటుడు సూర్య కూడా ఉన్నాడు. అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ యాక్టింగ్ కు ఫిదా అయిన సూర్య, రీసెంట్ గా వచ్చిన నోటా సినిమా కూడా చూశాడు. ఇప్పుడు టాక్సీవాలాకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందించాడు.

ఊహించని విధంగా సూర్య ఇలా తన సినిమాపై రియాక్ట్ అవ్వడంతో విజయ్ దేవరకొండ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఐ లవ్ యూ సూర్య అంటూ ట్వీట్ చేశాడు.

సూర్య ప్రశంసలతో టాక్సీవాలా సినిమా కోలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా శనివారం థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా, త్వరలోనే తమిళ్ లోకి కూడా డబ్ అయ్యే ఛాన్స్ ఉంది.