విజయ్ దేవరకొండ కరియర్ లోనే హయ్యెస్ట్

Wednesday,November 14,2018 - 02:35 by Z_CLU

జస్ట్ టాలీవుడ్ లోనే కాదు ఓవర్ సీస్ లోను ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది విజయ్ దేవరకొండ టాక్సీవాలా .  అందుకే విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ ని మైండ్ లో పెట్టుకుని U.S. లో ఏకంగా 111 సెంటర్ లలో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ లిస్టు విజయ్ దేవరకొండ కరియర్ లోనే హయ్యెస్ట్.

గీత గోవిందం కూడా U.S. లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందుకే ఈ సినిమా థియేటర్స్ లిస్టుని పెంచేశారు మేకర్స్.  నవంబర్ 16 న U.S. లో రిలీజవుతుంది టాక్సీవాలా. ఇప్పటికే అగ్రెసివ్ ప్రమోషన్స్ తో ఎట్రాక్ట్ చేస్తున్న ఫిల్మ్ మేకర్స్, ఇండియాలోనూ భారీ స్థాయిలో సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

గీతా ఆర్ట్స్ 2, UV క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకి రాహుల్ సంక్రిత్యాన్ డైరెక్టర్. ప్రియాంక జవాల్కర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. S.K.N. ఈ సినిమాకి నిర్మాత.