ఈ ‘టాక్సీ’ లో అన్నీ ఉన్నాయి – రాహుల్ సంక్రిత్యాన్

Thursday,November 15,2018 - 06:31 by Z_CLU

 ‘గీత గోవిందం’ సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా దగ్గరయ్యాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ మాటల్ని బట్టి విజయ్ దేవరకొండ, ఈ సారి జస్ట్ యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ నే కాదు, అన్ని జెనెరేషన్స్ ని థియేటర్స్ కి రప్పించే సూచనలే ఎక్కువ కనిపిస్తున్నాయి.

‘టాక్సీవాలా’ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి.  సెంటిమెంట్, ఇమోషన్, యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు, కిడ్స్ ఇష్టపడే సిచ్యువేషన్స్ కూడా టాక్సీవాలా లో ఉన్నాయి. మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండకి, టాక్సీ కి మధ్య ఉండే సిచ్యువేషన్స్ సినిమాని నెక్స్ట్ లెవెల్ లో నిలబెడతాయి. ఒకరకంగా చెప్పాలంటే ‘టాక్సీవాలా’ అన్ని ఏజ్ గ్రూప్స్ కి కనెక్ట్ అయ్యే పర్ఫెక్ట్ ఎంటర్టైన్ మెంట్ ప్యాకేజ్’ అని చెప్పుకున్నాడు రాహుల్ సంక్రిత్యాన్.

గీతా ఆర్ట్స్ 2, UV క్రియేషన్స్ బ్యానర్స్ పై S.K.N. నిర్మించిన ఈ సినిమాకి జేక్స్ బిజాయ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. భారీ గ్రాఫిక్ వర్క్ తో హాలీవుడ్ స్టైల్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. మాళవిక నాయర్ సినిమాలో కీ రోల్ లో కనిపించనుంది.