రవితేజ ఇంటర్వ్యూ

Wednesday,November 14,2018 - 01:42 by Z_CLU

శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కింది రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’. డిఫెరెంట్ స్టోరీలైన్ తో తెరకెక్కిన ఈ సినిమా అందరినీ మెస్మరైజ్ చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు మాస్ మహారాజ్. ఈ సందర్భంగా మీడియాతో జరిగిన ఇంటరాక్షన్ లో ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు డిస్కస్ చేశాడు. అవి మీకోసం…

ఇద్దరికీ కొత్తే…

‘అమర్ అక్బర్ ఆంటోని’ లాంటి స్క్రిప్ట్ హ్యాండిల్ చేయడం శ్రీనుకి కొత్తే, 3 డిఫెరెంట్ షేడ్స్ లో కనిపించడం, వేరియేషన్స్ చూపించగలడం నాకు కూడా కొత్తే, చాలా చాలెంజింగ్ గా అనిపించింది. ఎంజాయ్ చేస్తూ చేశాను సినిమాని.

అదీ అమర్ క్యారెక్టర్…

నాకు అమర్ అక్బర్ ఆంటోనిలో అమర్ అంటే చాలా ఇష్టం. ఆ క్యారెక్టర్ లో ఇమోషన్, ఇంటెన్సిటీ ఉంటుంది. అందుకే పర్సనల్ గా నేను ఆ క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యా.

48 గంటలు…

అసలీ అమర్, అక్బర్, ఆంటోని ఎవరు..? ఇంతకీ 3 డిఫెరెంట్ క్యారెక్టర్సా..? కాదా..? అనే క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియాలంటే ఇంకా 48 గంటల్లో తెలిసిపోతుంది.

అసలు సంబంధం లేదు…

అమితాబ్ ‘అమర్ అక్బర్ ఆంటోని’ కి  ఈ ‘అమర్ అక్బర్ ఆంటోని’ కి అసలు ఏ సంబంధం ఉండదు. అది వేరు.. ఇది వేరు. ఇక టైటిల్ ని సినిమా సబ్జెక్ట్ ఏ మాత్రం జస్టిఫై చేస్తుందనేది ఇంకొన్ని గంటల్లో తెలిసిపోతుంది.

శ్రీను వైట్ల మార్క్

ఎంత కొత్త సబ్జెక్ట్ అనుకున్నా, సినిమాలో శ్రీను వైట్ల మార్క్ ఉంటుంది. చాలా అల్లరి ఉంటుంది సినిమాలో.

ఇలియానా కరెక్ట్ చాయిస్…

ఈ సినిమాకి ఇలియానా పర్ఫెక్ట్ చాయిస్. బేసిగ్గా మంచి నటి. ఈ సినిమాలో చాలా బాగా పర్ఫామ్ చేసింది.

హిలేరియస్ ట్రాక్…

సినిమాలో నాకు, సత్యకు మధ్య ఉండే ట్రాక్ చాలా హిలేరియస్ గా ఉంటుంది. డబ్బింగ్ చెప్పేటప్పుడే నవ్వి, నవ్వి అలసిపోయాం… రేపు థియేటర్ లో ఇంకా అదిరిపోతుంది.

ఫ్లాష్ బ్యాక్ లో..

ఇలియానా చైల్డ్ హుడ్ క్యారెక్టర్ లో ‘లయ’ డాటర్ నటించింది. నా చైల్డ్ హుడ్ క్యారెక్టర్ మహాధన్ చేయాలి కానీ, టైమ్ కి వీసా రాక, వేరే కుర్రాడు చాలా బాగా చేశాడు.

టైమ్ పట్టింది..

‘నేల టికెట్’ కన్నా ముందే శ్రీను నాకీ సినిమా పాయింట్ చెప్పాడు. ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ టైమ్ పడుతుంది, అందుకే ఆ సినిమా అయ్యాకే ఈ సినిమా అనుకున్నాం.

శ్రీను వైట్ల ఫోకస్…

శ్రీను వైట్ల ఈ సినిమా కోసం కావాల్సినంత టైమ్ తీసుకున్నాడు. చాలా ఫోకస్డ్ గా పని చేశాడు అని నా ఫీలింగ్.

మన చేతుల్లో ఏం ఉండదు…

నేను ఫ్లాప్స్ ని సీరియస్ గా తీసుకోవడం కన్నా, అలాంటి తప్పులు నెక్స్ట్ సినిమాల్లో  చేయకుండా ఉండటానికే ట్రై చేస్తా. ఫ్లాప్స్ అసలు గెస్ చేయలేం. సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ డిజాస్టర్స్ ఇవ్వచ్చు. డిజాస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్స్ బ్లాక్ బస్టర్స్ ఇవ్వచ్చు. మనం చేయగలిగిందల్లా నచ్చింది చేసుకుంటూ పోవడమే.

పూరి జగన్నాథ్ తో సినిమా…

ఎప్పుడు ఉంటుందో ఎగ్జాక్ట్ గా చెప్పలేను కానీ, పూరితో సినిమా డెఫ్ఫినేట్ గా ఉంటుంది.