‘NTR’ లో తాతగారిలా కనిపించడం కోసం...

Friday,September 14,2018 - 04:05 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది ‘NTR’ బయోపిక్. ఈ సినిమాలో ANR రోల్ లో సుమంత్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోల్ కోసం ప్రత్యేకంగా నీట్ గా షేవ్ చేసుకుని కంప్లీట్ గా న్యూ లుక్ లో కనిపించనున్నాడు సుమంత్. ఈ సందర్భంగా కొత్త లుక్ తో సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేశాడు.  

NTR, ANR కలిసి చేసిన సినిమాలెన్నో. ఆన్ స్క్రీన్ తో పాటు  వీరిద్దరి ఆఫ్ స్క్రీన్ రిలేషన్ ని ఎలివేట్ చేస్తూ దర్శకుడు క్రిష్, ఇంట్రెస్టింగ్ సీన్స్ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కాంబినేషన్ సీన్స్ తెరకెక్కించే ప్రాసెస్ లో ఉన్న ఫిలిమ్ మేకర్స్, త్వరలో ANR లా కనిపించనున్న సుమంత్ స్టిల్ ని కూడా రివీల్ చేయనున్నారు.

భారీ బడ్జెట్ తో NTR రియల్ లైఫ్ ని గ్రాండియర్ గా సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లో ఉంది ‘NTR టీమ్. బాలకృష్ణ, విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. M.M. కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.